పొట్టి వీరయ్య మృతితో కలత చెందా.. చిరంజీవి భావోద్వేగంతో సంతాపం
దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. హృద్రోగంతో ఆసుపత్రిలో చేరిన ఆయన దురదృష్టవశాత్తు.. ఆదివారం (25 ఏప్రిల్) సాయంత్రం కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అతని చివరి కర్మలు సోమవారం జరుగుతాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల కళాకారుడు. సినీరంగంలో దశాబ్ధాల పాటు ఆయన సేవలందించారు.
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకుపైగా సుమారు 500 చిత్రాల్లో నటించిన పొట్టి వీరయ్య మృతితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని టాలీవుడ్ వర్గాలు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి గ్రామానికి చెందిన నటుడు వీరయ్య ఏప్రిల్ 25వ తేదీన గుండెపోటుతో మరణించడం విషాదంలోకి నెట్టింది. చిత్ర పురి కాలనీలో చివరి సందర్శనార్థం పెట్టిన వీరయ్య పార్ధీవ దేహానికి జీవితా రాజశేఖర్ దంపతులతోపాటు పలువురు సినీ నటులు శ్రద్దాంజలి ఘటించారు. నిర్మాత అనిల్ సుంకర తదితరులు ట్విట్టర్‌తో సంతాపం తెలిపారు.

పొట్టి వీరయ్య మృతితో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించి, వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను అని అన్నారు.
పొట్టి వీరయ్య మరణంపై సినీ, రాజకీయ వర్గాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సంతాప ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


Click it and Unblock the Notifications











