మార్పు రావాలి.. మంచు లక్ష్మీ వద్ద నేర్చుకో.. మోహన్ బాబుకు చిరు చురక!

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ను, పంచ్ డైలాగ్స్‌ను వెండితెరపై చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. కామెడీ సీన్స్‌కు పెట్టింది పేరు చిరంజీవి. చిరు కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమే. అలాంటి చిరు సోషల్ మీడియాలోకి ఎంటరైతే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

Recommended Video

Megastar Chiranjeevi Hilarious Counter To Mohan Babu
దూకుడు పెంచిన చిరు..

దూకుడు పెంచిన చిరు..

ఇన్నాళ్లు చిరంజీవి సోషల్ మీడియాను బాగానే మిస్ అయ్యాడు. అలాగే చిరు టైమింగ్, పంచ్‌ను నెటిజన్స్ కూడా బాగానే మిస్ అయ్యారు. ఈ మేరకు ఇన్ని రోజులు మిస్ అయ్యిందంతా ఒకేసారి ఇచ్చేందుకు సిద్దమయ్యాడా? అని అనుమానం కలుగుతోంది.

 సెలెబ్రిటీల స్వాగతం..

సెలెబ్రిటీల స్వాగతం..

ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుకు.. సెలెబ్రిటీలంతా స్వాగతం పలికారు. ట్విట్టర్ ప్రపంచంలోకి వెల్కమ్ అంటూ పూరీ జగన్నాథ్, మోహన్ బాబు, రాఘవేంద్రరావు, తమన్నా, కాజల్, రాధిక, సుహాసిని ఇలా ఎంతో మంది స్టార్స్ ట్వీట్ చేశారు.

మోహన్ బాబుకు అదిరిపోయే రిప్లై..

సోషల్ మీడియాలోకి చిరు ఎంట్రీని స్వాగతిస్తూ.. మిత్రమా వెల్‌కమ్ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశాడు. దానికి ప్రతిగా.. థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా..? రాలేననుకున్నావా? అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. ఇక ఈ రిప్లై చూసిన నెటిజన్స్.. చిరు స్పీడ్‌కు షాక్ అయ్యారు. ఈ కౌంటర్‌కు స్పందించిన మోహన్ బాబు.. ఈ సారి కౌగిలించుకున్నప్పుడు చెబుతా అంటూ ట్వీట్ చేశాడు.

 మంచు లక్ష్మీ వద్ద నేర్చుకో..

మంచు లక్ష్మీ వద్ద నేర్చుకో..

తాజాగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. మిత్రమా కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి.. నో హగ్స్.. నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే.. సామాజికి దూరం పాటించడం అవసరం.. నిన్ను, నీ పక్క వాళ్లను కాపాడుకోవడం చాలా అవసరం.. వీటిపై ఇంకా అవగాహన రావాలంటే.. మంచు లక్ష్మీ వీడియోలు చూడు అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X