ఆయన గౌరవార్థం ఆ వీడియోను పోస్ట్ చేయడం లేదు.. చిరు వివరణ
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు.. చిరంజీవి అంటే ఏంటి? ఆయన స్పెషల్ ఏంటి? అని అడిగితే.. డ్యాన్స్ అంటు గుక్కతిప్పుకోకుండా చెబుతారు. అంతలా తన డ్యాన్స్ మూమెంట్స్‌తో తెరపై ముద్ర వేశాడు. నాటి కాలంలో ఇండియన్ హీర్లోలో చిరంజీవిలా కాలు కదిపేవారు ఎవ్వరూ లేరు.
అయితే మారుతున్న ట్రెండ్ ప్రకారం డ్యాన్సులను కొత్త పుంతలు తొక్కించిన చిరు.. ఇప్పటికీ మేటీ డ్యాన్సర్‌గానే కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటివారెందరూ వచ్చినా చిరు స్టెప్పులకు ఉండే క్రేజే వేరు. నేడు (ఏప్రిల్ 29) అంతర్జాతీయ నాట్య దినోత్సవం. ఈ సందర్బంగా చిరు ఓ వీడియో సందేశాన్ని అందించాడు.

నేడు (ఏప్రిల్ 29) అంతర్జాతీయ నాట్య దినోత్సవమని, తనకు డ్యాన్స్‌లకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలిపాడు. తనకెప్పుడైనా మనసు బాగోలేకపోతే రూమ్‌లోకి వెళ్లి.. మ్యూజిక్ ఆన్ చేసి డ్యాన్స్ వేసేవాడినని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ లాక్ డౌన్‌లో అందరూ డిప్రెషన్‌లో ఉండి ఉంటారు.. ఈ ఒక్క రోజు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయండని, మీరు స్టెప్పులు వేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసురకోండని సలహా ఇచ్చాడు. అలా అందరిలో స్ఫూర్తి నింపండని, తాను కూడా సాయంత్రం ఆరు గంటలకు తన డ్యాన్స్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తానని తెలిపాడు.
అయితే నేడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందడంతో సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల సెలెబ్రిటీలు ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో తానిచ్చిన మాట ప్రకారం వీడియోను పోస్ట్ చేయడం లేదని తెలిపాడు. ఈ మేరకు పోస్ట్ చేస్తూ... ఇర్ఫాన్ ఖాన్ గౌరవార్థం మీకు ప్రామీస్ చేసిన విధంగా వీడియోను షేర్ చేయడం లేదని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











