చిరంజీవి మాజీ అల్లుడు కన్నుమూత.. శ్రీజ మాజీ భర్త ఎలా చనిపోయారంటే?

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో మరణించారు. శిరీష్ మరణంతో ఆయన స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజను శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనంగాను, వివాదంగాను మారింది. వీరి వివాహం వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందనే వార్త కూడా బలంగా వినిపించింది.

Chiranjeevi daughter Sreeja ex husband Sirish Bharadwaj died to Lung Failure in Hyderabad

అయితే శ్రీజ, శిరీష్ వైవాహిక సంబంధాలు ఎంతోకాలం కొనసాగలేదు. వారిద్దరికి ఓ పాప జన్మించిన తర్వాత విడిపోవడం తెలిసిందే. అప్పటి నుంచి చిరంజీవి కుటుంబంతోనే శ్రీజ ఉంటున్నారు. శ్రీజ కూతురిని చిరంజీవి స్వయంగా అల్లారుముద్దుగా చూసుకొంటున్నారు.

అయితే శ్రీజ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత శిరీష్ మరో అమ్యాయిని వివాహం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. లాయర్ వృత్తిలో ఉన్న ఆయన కొన్ని సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. అయితే రాజకీయంగా అంతగా క్రీయాశీలకంగా వ్యవహరించకపోవడంతో పొలిటికల్ జర్నీ కూడా అంత గొప్పగా సాగలేదు.

Chiranjeevi daughter Sreeja ex husband Sirish Bharadwaj died to Lung Failure in Hyderabad

శ్రీజతో విడాకుల తర్వాత శిరీష్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సామాన్యమైన జీవితం గడిపారు. ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీతో ఎలాంటి గొడవలు లేకుండా తన లైఫ్‌ను లీడ్ చేయడం గమనార్హం. అయితే చిన్న వయసులోనే ఆయన మరణించడంపై స్నేహితులు ఆవేదన చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X