twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు.. చిరంజీవి ఎమోషనల్

    |

    భారతదేశ తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాను తీశాడు. అయితే తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఎయిర్ పోర్ట్‌కు పెడతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ప్రకటనపై చిరంజీవి స్పందించాడు.

    కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌తో కలిసి సీఎం జగన్‌ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించాడు.

    Chiranjeevi Emotional Kurnool Airport as Uyyalavada narasimhareddy

    ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ.. 'భారత ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు పెట్టామని గౌరవనీయులైన సీఎం జగన్ ఇచ్చిన ప్రకటన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. గొప్ప దేశభక్తుడు, ప్రపంచానికి తెలియని యోధుడికి ఇప్పుడు సరైన గుర్తింపు లభించింది. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను తెరపై పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం' అని అన్నాడు.

    English summary
    Chiranjeevi Emotional Kurnool Airport as Uyyalavada narasimhareddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X