Bholaa Shankar Pre Release ఇక ఈ జన్మ చాలదా? భగవంతుడా రుణపడి ఉంటా.. చిరంజీవి భావోద్వేగం

మెగాస్టార్ చిరంజీవి, అందాల భామలు కీర్తి సురేష్, తమన్నా భాటియా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 11 తేదీన రిలీజ్ అవుతున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్ శ్రీను, యానీ మాస్టర్, లోబో, సురేఖవాణి, రాజ రవీంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ మాట్లాడుతూ..

అమ్మ ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అభిమానుల ప్రేమ ఎప్పుడూ వినిపించినా ఎప్పుడూ తరగదు. ఇలాంటి గొప్ప జన్మ ఇక చాలాదా? ఇలాంటి జన్మ ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకొంటాను. నా అభిమానులు ఎప్పుడు కూడా రొమ్ము చించుకొనేలా ఉండేలా నేను ఎప్పటికప్పుడూ మార్చుకొంటూ వచ్చాను. మీరు మా అన్నయ్య అని గొప్ప చెప్పుకొనేంతగా నేను ఎదిగాను అని చిరంజీవి అన్నారు.

Chiranjeevis Bholaa Shankar movie speech

నా అభిమానుల్లో యూత్ ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలను చూస్తుంటే.. వారి తల్లిదండ్రులైనా నా అభిమానులు ఇక్కడికి పంపించి ఉంటారని అనుకొంటాను. ఇలాంటి నా అభిమానుల జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలి అని చిరంజీవి అన్నారు.

నేను ఖైదీ నంబర్ 150లో ఒక డైలాగ్ చెప్పాను. నాకు నచ్చేది చేస్తాను. నచ్చిందే చూస్తాను అని అన్నాను. నాకు నచ్చినందునే ఈ భోళా శంకర్ సినిమాను చేశాను. మీకు కూడా నచ్చేలా చేశాను. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ నాకు అర్దం కానిది ఒకటి ఉంది. రీమేక్ ఎందుకు చేస్తారని ఎందుకు అంటారో తెలియదు. కానీ మంచి కంటెంట్ మన ప్రేక్షకులకు ఇచ్చేందుకు చేసే ప్రయత్నం ఎందుకు నచ్చదో అని చిరంజీవి చెప్పారు.

Chiranjeevis Bholaa Shankar movie speech

వేదాళం అనే సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో లేదు. కాబట్టి నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్ కలిసి వచ్చి నాకు వేదాళం రీమేక్ గురించి చెప్పారు. అయితే ఇప్పటికే గాడ్‌ఫాదర్ చేశాం. ప్రేక్షకులు ఒప్పుకోరేమో అంటే.. ఓటీటీలో లేదని చెప్పారు. దాంతో అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో లేదని తెలుసుకొన్న తర్వాతే ఈ సినిమా నచ్చి చేశాను అని చిరంజీవి అన్నారు. ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకంతోనే చేశాను

కొన్ని సినిమాలు చేసేటప్పుడు చాలా అనుమానాలు వస్తుంటాయి. కానీ ఈ సినిమా షూటింగ్‌లో ఎలాంటి అనుమానాలు రాలేదు. ప్రతీ క్షణం సూపర్ హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. ఈ షూట్‌లోనే సూపర్ హిట్ అని ఫీల్ అయ్యాం. ఈ సినిమాలో నటించిన కీర్దీ సురేష్, తమన్నా, గెటప్ శ్రీను, హైపర్ ఆది, బిత్తిరి సత్తి, లోబో, సత్య, ఉత్తేజ్ ఇలాంటి యాక్టర్లు ఉండేవారు. వారిని చూడగానే మంచి ఎనర్జీ, ఉత్సాహంతో సాగింది

Chiranjeevis Bholaa Shankar movie speech

దర్శకుడు మెహర్ రమేష్‌కు ప్రతీ రోజు టెన్సన్‌తో ఉండేది. సెట్లో నా ముఖంలో నవ్వు చూడగానే మెహర్ రమేష్ సంతోషంలో మునిగిపోయేవాడు. మెహెర్ రమేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసేవాడు. తన స్వయంశక్తితో దర్శకుడిగా ఎదిగాడు. మా సిఫారసుతో ఎన్నడూ ఆఫర్లు పొందలేదు. దర్శకుడిగా మెహర్ రమేష్ తన ప్రతిభతోనే ఎదిగాడు అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X