Balakrishna 50Yrs Celebrations: ఇంద్ర మూవీకి బాలయ్యే స్పూర్తి..ఇద్దరం కలిసి ఓ ఫ్యాక్షన్ మూవీ..చిరంజీవి ఎమోషనల్
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ భారీ ఎత్తున ఈవెంట్‌ను నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి, రజనీకాంత్‌తోపాటు యువ హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి తన మిత్రుడు నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కన్నుల పండువగా నిర్వహించిన బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందంగా ఉంది. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర రంగం ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకలా చూస్తున్నది. సినిమా రంగంలో అరుదైన రికార్డును బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది అని చిరంజీవి అన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
నందమూరి, మెగా అభిమానులు, ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు అనే విషయం నాకు బాధను కలిగిస్తుంది. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలియడం కోసమే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. అందుకే ఇలాంటి వేడుకలు జరగాలి అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. మేమంతా కలిసి డ్యాన్స్ కూడా చేస్తాం. హీరోగా 50 సంవత్సరాల ప్రయాణం, ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని చిరంజీవి ప్రార్థించారు.
సినీ నటుడిగానే కాకుండా రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం నభూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య అంటూ చిరంజీవి ఉద్వేగంగా ప్రసంగించారు. అయ్యప్ప మాలతో వచ్చిన ఆయనను బాలయ్య ఆనందంగా రిసీవ్ చేసుకొన్నారు. ఈ వేడుకలో ఒకే ఫ్రేమ్‌లో రజనీ, చిరు, బాలయ్య కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











