twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియాలోకి మెగాస్టార్ ఎంట్రీ.. అందుకోసమేనంటూ వీడియో సందేశం

    |

    జనాలకు సోషల్ మీడియా ఎంతగా అలవాటైపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఖాతాలు లేనివారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో ఉన్నవారే. సినిమా అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు తారలు.

    దాదాపు హీరోలంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అభిమానులకు అందుబాటులో ఉంటారు. తమ అభిప్రాయాలను తెలపడమే కాకుండా, ఫ్యాన్స్‌ను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం వంటివి చేస్తుంటారు. తెలుగులో అత్యధిక ఫాలోయిగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందుంటాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో మహేష్ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

     Chiranjeevi Enter To Social Media

    ప్రభాస్, రామ్ చరణ్ వంటివారు సోషల్ మీడియాలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకోవడానికి, తన ఆలోచనలను ప్రజలతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నానని, ఈ ఉగాది రోజున సోషల్ మీడియా ఖాతాను ప్రారంభిస్తానని వీడియో సందేశం ద్వారా తెలిపాడు. ఈ మేరకు నాగబాబు, వరుణ్ తేజ్ వంటి చిరంజీవి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే మూడు లక్షల మందికిపైగా పాలోవర్స్ వచ్చి చేరారు.

    English summary
    Chiranjeevi Enter To Social Media. He Said That To Share His Expressions To Fans And People. O Occassiob Of Ugadi He Will Be On Borad To Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X