Chiranjeevi: రామ్ చరణ్ మీద అనుచిత వ్యాఖ్యలు... ఆ రైటర్‌కే చిరంజీవి బయోగ్రఫీ రాసే బాధ్యత

మెగాస్టార్ చిరంజీవి బయోగ్రఫీ బాధ్యతలను ఓ ప్రముఖ రైటర్ దక్కించుకున్నారు. ఆయన ఎవరో కాదు.. ఒకప్పుడు రామ్ చరణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు ఈ అవకాశం దక్కింది. చిరంజీవి తన బయోగ్రఫీ రాసే బాధ్యతను.. యండమూరికి అప్పగించినట్లు స్వయంగా మెగాస్టార్ ప్రకటించారు. అసలు రామ్ చరణ్ మీద ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు.. ఎందుకు చిరంజీవి ఆయనకు అప్పగించారు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా విశాఖ పట్నంలోని రుషికొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయనతో పాటుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు, ప్రముఖులు హాజరు అయ్యారు.

Chiranjeevi entrusted the responsibility of writing his biography to Writer Yandamuri Veerendranath Full Details Here

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటుల గురించే కాకుండా తన బయోగ్రఫీ గురించి కీలక విషయాలు చెప్పుకువచ్చారు. తన బయోగ్రఫీని ప్రముఖ రచయిత, డైరెక్టర్ యండమూరి వీరేంద్ర నాథ్ కు అప్పగిస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు. ఒకప్పుడు కొడుకు రామ్ చరణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రచయితకు తన బయోగ్రఫీ అప్పగించడం మెగా ఫ్యాన్సుకు మింగుడు పడటం లేదు.

ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ... నా బయోగ్రఫీ రాసే బాధ్యత ప్రముఖ రచయిత కమ్ డైరెక్టర్ యండమూరి వీరేంద్ర నాథ్ కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరికి సాటి లేరు. నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు. యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యానని చెప్పుకువచ్చారు. యండమూరిపై ప్రశంసలు కురిపించారు.

మరోవైపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు. వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనుభవాలు మర్చిపోలేనని వెల్లడించారు. లావు శ్రీకృష్ణ దేవరాయలను చిరంజీవి ప్రశంసించారు. ప్రజాసేవ తప్ప సంపాదనపై ధ్యాస లేని ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలు నాకు కనిపించారంటూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక మెగా స్టార్ బయోగ్రఫీ బాధ్యతను యండమూరికి అప్పగించడం మెగాస్టార్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చడం లేదు. ఒకప్పుడు చరణ్ గురించి యండమూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చరణ్ మొహం సరిగా లేదు అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు.. ఆ మొహాన్ని సర్జరీ చేయించి బాగు చేయించారు అంటూ అనుచితంగా మాట్లాడారు. అంతే కాదు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ తో పోల్చీ.. రామ్ చరణ్ ను కించ పరిచేలా మాట్లాడారు.

ఇక ఇప్పుడు అలాంటి ఎన్నో ఆరోపణలను రామ్ చరణ్ తిప్పి కొట్టి తన సత్తా ఏంటో చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన యాక్టింగ్ తో హాలీవుడ్ నటులతో ప్రశంసలు తెచ్చుకున్నాడు. అవమానించిన, అవహేళన చేసిన వారందరికీ రామ్ చరణ్ క్రేజ్, పాపులారిటీ ఓ చెంపపెట్టులాంటిదని ఫ్యాన్స్ అంటుంటారు. ఇక చరణ్ ను అవమానించిన యండమూరికి తన బయోగ్రఫీ చిరంజీవి అప్పగించడం మెగా ఫ్యాన్సుకు అంతగా నచ్చడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X