మన శంకర వరప్రసాద్ థియేటర్‌లో తీవ్ర విషాదం.. చిరంజీవి మూవీ చూస్తూ ప్రాణాలు విడిచిన మెగా అభిమాని!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)ఆదివారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్లలో సందడి చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుండగా, అభిమానులు, ప్రేక్షకులు పండగ వాతావరణంలో సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఉత్సాహభరిత వాతావరణంలోనే హైదరాబాద్‌లో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుని అందరినీ కలచివేసింది.

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలోని అర్జున్ థియేటర్ (Arjun Theatre)లో ఈ సినిమా చూస్తున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై అయిన ఆనంద్ కుమార్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. సినిమా విడుదలైన మొదటి రోజే, ఆదివారం ఉదయం 11:30 గంటల షోకు ఆయన థియేటర్‌కు వచ్చారు.

Chiranjeevi Fan Dies of Heart Attack While Watching Mana Shankara Vara Prasad Garu in Hyderabad

సినిమాను ఉత్సాహంగా చూస్తున్న సమయంలో, ఆనంద్ కుమార్ ఒక్కసారిగా తన సీట్లోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను గమనించిన పక్కన కూర్చున్న ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించింది.

అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమికంగా తీవ్రమైన గుండెపోటే మరణానికి కారణమని వైద్యులు వెల్లడించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఆనంద్ కుమార్, చిరంజీవి సినిమాలంటే అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూసే ఆనంద క్షణాల్లోనే ఆయన ఇలా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని, అభిమానులను తీవ్రంగా కుంగదీసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఒకవైపు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఘన విజయంతో థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తుండగా, మరోవైపు ఈ విషాద ఘటన టాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. సోషల్ మీడియాలోనూ అభిమానులు, సినీ ప్రేమికులు ఆనంద్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X