Chiranjeevi Waltair Veerayya విజయోత్సవంలో అపశ్రుతి.. ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట.. చిన్నారులకు గాయాలు!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్యగా అదరగొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాగా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో వింటేజ్ లుక్ తో మెస్మరైజ్ చేసిన చిరంజీవి కామెడీ, యాక్షన్, డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా వీరయ్య విహారం అంటూ విజయోత్సవ వేడుక నిర్వహించగా అపశ్రుతి చోటుచేసుకుంది.

ఖాతాలో మరో విజయం..
దాదాపు నాలుగు దశాబ్ధాలుగు తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్యతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఎంటర్టైన్ చేసిన వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా నటించిన చిత్రం వాల్తేర్ వీరయ్య. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసింది వాల్తేరు వీరయ్య చిత్రం.

కోట్లలో కలెక్షన్స్..
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించిన విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత అన్నదమ్ములుగా నటించిన చిరు, రవితేజ తమ యాక్టింగ్ అదరగొట్టారని టాక్ వస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. అలాగే ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టిందని నిర్మాతలు చెబుతున్నారు.

మంత్రి ఎర్రబెల్లి హాజరు..
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయాన్ని చిత్రబృందం ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం వీరయ్య విజయ విహారం పేరుతో సక్సెస్ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాత్రి నిర్వహించారు. యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ తో పాటు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా టీమ్ కూడా పాల్గొంది.

తొక్కిసలాట..
వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు యూనివర్సిటీ గేటు బయట ఎదురుచూశారు. అయితే ఇంతలో భద్రతా సిబ్బంది గేట్ ఓపెన్ చేయడంతో.. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొంతమంది చిరు అభిమానులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అలాగే వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











