మెగా స్పీడు.. అప్పుడే పూర్తిచేసిన చిరంజీవి

ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీంతో వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసిన చిత్రయూనిట్.. శరవేగంగా ఆ పనులను పూర్తి చేస్తోంది.

ఇందులో భాగంగా 'సైరా నరసింహా రెడ్డి' డబ్బింగ్ పనులు చేస్తున్నారు. ముందుగా చిత్రంలో చిరంజీవి పాత్రకు సంబందించిన డబ్బింగ్ పూర్తిచేశారు. కేవలం 20 గంటల సమయంలోనే చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పారట. ఓ స్టార్ హీరో ఇంత త్వరగా డబ్బింగ్ పూర్తిచేయడం.. అదీ చారిత్రిక నేపథ్యం ఉన్న కథాంశంలో ఆశ్చర్యంగా ఉందని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇక చిత్రంలోని ఇతర నటీనటుల విషయానికొస్తే.. సుదీప్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనుండగా, విజయ్ సేతుపతికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించనున్నారు.

Chiranjeevi Finished His Dubbing Work in Sy Raa Narasimhaa Reddy

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ హంగులతో సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కింది. చిరంజీవి కెరీర్‌లో తొలి చారిత్రాత్మక చిత్రం ఇది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్ర పోషిస్తోంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22వ తేదీన 'సైరా' ట్రైలర్ విడుదల చేయనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X