చిరు లుంగీ పై ఆర్జీవి అలాంటి సెటైర్లు.. ఏకిపారేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం దక్కించుకున్నారో తెలిసిందే. టాలీవుడ్ ప్రస్తుతం మెయిన్ పిల్లర్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలకు దీటుగా యాక్షన్ తో కూడిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారు.
టాలీవుడ్ లో ఎలాంటి ఘటన జరిగినా తాను బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. కరోనా టైంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమ కోసం ఎంతలా పనిచేశారో తెలిసిందే. మరోవైపు ఆర్టిస్టులను కూడా ఆదుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక చిరంజీవి సేవా కార్యక్రమాలను గుర్తించి ఏకంగా కేంద్ర ప్రభుత్వమే పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. రీసెంట్ గా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అందుకున్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సెట్ చేసిన మెగాస్టార్, ఇప్పటికీ అరుదైన అవార్డులను, రికార్డులను తన సొంతం చేసుకుంటున్నారు.

ఇంతటి ఘన కీర్తి కలిగిన మెగాస్టార్ చిరంజీవి పై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హేళనాత్మకమైన కామెంట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో.. అమ్మడు కుమ్ముడు.. సాంగ్ పై ఆర్జీవి అప్పట్లో దారుణంగా టోల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి అందులో లుంగీ కట్టుకోవడం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఆ పాటలో లుంగీ కట్టుకొని డాన్స్ వేయడం చూస్తే హాలీవుడ్ ప్రముఖులే ఆశ్చర్యపోతారని, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులే ఆశ్చర్య పోతారని సెటైరికల్ గా పోస్టులు పెట్టారు. అయితే ఆ పోస్ట్ పై మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా స్పందించారు.
రామ్ గోపాల్ వర్మ వేసిన సెటైర్లకు మండిపోయారు. అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా ఆయన అలా ఎటకారంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. ఆయనకు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడుతారో ఒక్కో సందర్భంలో అసలు అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఆయన విమర్శనాత్మక పోస్టులు చూస్తుంటే ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నారని అనడంలో సందేహం లేదన్నారు. ఇంత బాధ్యతారహితంగా పోస్టులు పెట్టడం వల్ల ఆయన ఏ మాత్రం ఆలోచించరా అనేది ప్రశ్నార్థకం. అలాంటివి చాలా పోస్టులు చూసానని, అప్పుడు ఆయన ఎటకారం బాగా అర్థం అవుతుందని మండిపడ్డారు.
ఇక ఏదేమైనా రాంగోపాల్ వర్మ ఒక జీనియస్ అని పొగిడారు కూడా. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్న చిరంజీవి ఇలాంటి ఎటకారాలు చేయడం ఏమాత్రం బాగోదని అభిప్రాయపడ్డారు. ఇకపై ఆయనను గొప్ప స్థాయిలో చూడాలని చిరంజీవి కోరుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా157 ప్రాజెక్టులో నటించనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. మన వైపు రామ్ గోపాల్ వర్మ నుంచి 'శారీ' అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 4న ఈ సినిమా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











