చిరంజీవి ఇంట్లో యాంకర్ సుమ దొంగతనం.. బయటపెట్టిన మెగాస్టార్.. సురేఖకు ఫిర్యాదు!

హైదరాబాద్‌లో జరిగిన తెలుగు డిజిటల్ మీడియా ఫౌండేషన్ ఆరిజిన్ వేడుక సందడి సందడిగా మారింది. డిజిటల్ మీడియా ఆవిర్భావ సభలో చిరంజీవి, విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే అందరినీ ఆటపట్టించే సుమను మెగాస్టార్ చిరంజీవి ఆటపట్టించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సుమను ఆటపట్టిస్తూ..

డిజిటల్ మీడియా ఫౌండేషన్ వేడుకలో విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి పంచుకొన్న ఆభిప్రాయలు, అనుభవాలు అభిమానులకు మంచి అనుభూతిని పంచాయి. చిరంజీవిని విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేసి పలు విషయాలను రాబట్టారు. మధ్య తరగతి జీవితం నుంచి వచ్చిన ఇద్దరు కూడా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి చాలా విషయాలు వెల్లడించారు.

Chiranjeevi Funny Conversations with Anchor Suma at Telangana Digital Media Foundation Origin Day

ఈ వేడుక ముగింపులో చిరంజీవి మాట్లాడేందుకు మైక్ తీసుకొంటుండగా సుమను చూసి ఏదో అనుమానం వ్యక్తం చేశాడు. విజయ్ దేవరకొండతో ఏదో మాట్లాడి సుమను దగ్గరకు పిలిచాడు. సుమ దగ్గరకు రాగానే ఆమెతో మాట్లాడుతూ.. సురేఖతో ఫోన్‌లో మాట్లాడుతాను అంటూ చెప్పి ఫోన్ కలిపాడు.

తన భార్య సురేఖతో మాట్లాడుతూ.. నా గ్రే సూట్, బ్లాక్ పాయింట్ పోయిందని చెప్పావుగా.. ఎవరో ఎత్తుకుపోయారు. కనపడటం లేదని అన్నావుగా.. అవేమీ దొరకడం లేదన వరీ కావొద్దు. అవి దొరికాయి. అవి తీసుకొని తెచ్చి ఇస్తాను. మన సుమే వాటిని కొట్టేసింది. తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఆమె మన ఇంటికి ఎప్పుడు వచ్చిందో కానీ చేతివాటం ప్రదర్శించింది అని చిరంజీవి అన్నారు.

అయితే చిరంజీవి మాటలకు అడ్డుపడుతూ.. మీరు పెద్ద మనసుతో ఇచ్చేయండి అని అంటే.. అవి చాలా కాస్ట్‌లీ. అంతేకాకుండా నా కష్టార్జితం అని చిరంజీవి అంటే... నా ముందు కాస్ట్ ఓ లెక్కనా? అంటూ సుమ అంది. దాంతో నా కష్టార్జితం.. ఊరికే పోవద్దు అని అంటే.. నేను వెంటనే తెచ్చి ఇచ్చేస్తాను అని సుమ అనడంతో సరదా సంభాషణకు పుల్ స్టాప్ పండింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X