కీర్తి సురేష్.. నీపై అలాంటి ఫీలింగ్ లేదు.. చిరంజీవి స్పీచ్‌తో భలే నవ్వించారుగా!

మెగాస్టార్ చిరంజీవి, మహానటి కీర్తి సురేష్ నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11 వ తేదీన రిలీజ్ అవుతున్నది. తమిళ హిట్ మూవీ వేదాళం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించగా, మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో కీర్తి సురేష్ గురించి చిరంజీవి మాట్లాడుతూ...

నేను మహానటి కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే.. ఈ రోజుల్లో అద్బుతమైన నటి అంటూ ఎవరైనా ఉన్నారంటే.. అది కీర్తి సురేష్ మాత్రమే. మా ఇంటిలో బిడ్డ మాదిరిగా అనిపిస్తుంది. బ్రదర్, సిస్టర్‌గా నటించాం. కాబట్టి మా మధ్య సోదరభావం వస్తున్నది. కానీ నేను ఆ ఫీలింగ్‌ను దూరం పెడుతున్నాను. ఎందుకంటే నెక్ట్స్ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించాలంటే.. ఈ ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంది అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi funny speech about Keerthy Suresh at Bholaa Shankar pre release event

భోళా శంకర్ సినిమాలో అన్నాచెల్లెల్లుగా బాగా నటించారు. ఈ సినిమాకు మీ ఇద్దరి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుందని అంటే.. ఆ ఫీలింగ్‌ను ఈ సినిమా వరకే ఉంచుకోవాలని చెప్పాను. అన్నయ్య అని కీర్తి సురేష్ ఎక్కడ అంటుందేమోనని భయపడ్డాను. మెహర్ రమేష్‌ను అన్నయ్య అంటే ఒకే కానీ నన్ను మాత్రం అన్నయ్య అనకు. నన్ను అన్నయ్య అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి అన్నయ్య అంటే కష్టం కదా. అందుకే మొదటి రోజునే అలా పిలువొద్దని చెప్పాను అని చిరంజీవి అన్నారు.

పున్నమి నాటి వెన్నెల మాదిరిగా, జలజలా పారుతున్న నదిపై ప్రయాణిస్తున్న పడవ మాదిరిగా కీర్తి సురేష్ ఉంటుంది. ఎప్పుడూ సహజ సిద్దంగా నవ్వుతూ ఉంటుంది. ఈ సినిమా ముగిసిన తర్వాత నేను మిస్ అవుతున్నానని రెండు మూడు సార్లు చెప్పింది. నేను చెప్పకపోతే ఏమైనా అనుకొంటుందేమోనని ఒకసారి బలవంతంగా మిస్ యూ అని చెప్పాను అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi funny speech about Keerthy Suresh at Bholaa Shankar pre release event

కీర్తి సురేష్ ప్రొఫెషనల్ యాక్టర్. ఏదో వచ్చామా? చేశామా? మన పని అయిపోయిందా? అనే విధంగా కాకుండా కూర్చొని చాలా విషయాలు చెబుతుంది. కీర్తి సురేష్ అమ్మగారు హీరోయిన్‌గా నేను పున్నమినాగు సినిమాలో నటించాను. ఆ తర్వాత కీర్తి గురించి తెలిసి ఆమెను చూస్తూనే ఉన్నాను. ఆమె నటిగా ఎదిగిన తీరు అద్బుతంగా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

 Chiranjeevi funny speech about Keerthy Suresh at Bholaa Shankar pre release event

మహనటి చిత్రంలో కీర్తి సురేష్ ఆమె ఫెర్ఫార్మెన్స్ చూసి మాటలు రాలేదు. నాకు ఇస్టమైన సావిత్రి పాత్రలో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆపుకోలేక వారిని నా ఇంటికి పిలిచాను. ఆ సమయంలో కీర్తి రాలేకపోయింది. అప్పుడు వాళ్ల అమ్మతో మాట్లాడుతూ.. మీ కూతురుకు జాతీయ అవార్డు వస్తుందని చెప్పాను. ఆ తర్వాత జాతీయ అవార్డు రావడం చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి మహానటి నాతో నటించింది. మా ఇద్దరి సీన్లు పండితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. భోళా శంకర్ సినిమా షూటింగులో మా ఇంటి ఫుడ్ తిని ఎంత గ్లామర్‌గా తయారైందో చూడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X