కొరటాల సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' పనులతో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీంతో సైరా పనులు చూసుకుంటూనే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న తన తదుపరి సినిమాపై దృష్టి సారించారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న చిరు- కొరటాల మూవీ మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి రానుందని సమాచారం. మెగాస్టార్ కెరీర్ లో 152 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా కథ, కథనం, చిరంజీవి క్యారెక్టర్ విషయంలోనూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన డ్యూయల్ రోల్ విషయమై స్పందించారు చిరు.

చిరు- కొరటాల మూవీలో తాను డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అవన్నీ రూమర్లే అని అన్నారు. ఇప్పటికే సైరా సినిమా కోసం కాస్త సన్నబడిన చిరంజీవి.. మెగా 152 లో మరింత స్లిమ్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథాంశం గ్రామీణ నేపథ్యంలో ఉండనుందని, ఇందులో రైతుగా చిరు కనిపించనున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తుండగా.. హాకీ కోచ్‌గా చిరు డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నాడని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికైతే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అతి త్వరలో మెగా 152 కి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











