ప్రజారాజ్యమే జనసేనగా.. జై కొట్టిన మెగాస్టార్ చిరంజీవి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైలా. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ..
లైలా సినిమా లాంటి ఫంక్షన్లు వచ్చే ముందు కొంత అన్ ఈజీగా ఉన్నాను. కానీ వెళ్లేటప్పుడు మంచి ఎనర్జీతో పోతున్నాననే ఆనందం కలిగింది. అయితే విశ్వక్ సేన్ ఫంక్షన్‌కు వెళ్తుంటే.. ఆయన ఫంక్షన్‌కు వెళ్తున్నావా? ఆయన బాలకృష్ణ కాంపౌండ్ అని అడిగారు. అయితే ఒక నటుడికి మరో నటుడిపై ప్రేమ ఉండకూడదా? నాపై అప్యాయత ఉండకూడదా? ఇండస్ట్రీలో యాక్టర్ల మధ్య అమరికలు లేవు అని చిరంజీవి అన్నారు.

లైలా సినిమాలో ఆడపిల్లగా కనిపించబోతున్నారు. గతంలో నేను, రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఆడవేషాలు వేశాం. ఆ సినిమాలన్నీ పెద్ద హిట్లుగా మారాయి. ఈ సినిమాలో కూడా విశ్వక్ సేన్ చాలా అందంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడపిల్లల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న విశ్వక్.. ఇక మగవాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకొంటాడు అని చిరంజీవి అన్నాడు.
కరాటే రాజు గారు నాకు 15 ఏళ్ల క్రితం పరిచయం. ప్రజా రాజ్యం ఇప్పుడు మారిపోయి జనసేనగా రూపాంతరం చెందింది. ఆ రోజున నాతోపాటు రాజకీయంగా ట్రావెల్ అయ్యారు. నేను ఆయనకు టికెట్ కూడా ఇచ్చాను. అప్పటి నుంచి నాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒకసారి అయ్యప్ప పూజకు వారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో విశ్వక్ సేన్ చిన్నపిల్లాడు. అమెరికాలో ఉంటూ తెలుగు పరిశ్రమలోకి వచ్చాడు. ఇక్కడ కూడా విశ్వక్ సత్తా చాటాలి.. జెండా పాతాలి అని చిరంజీవి దీవెనలు అందించారు.
లైలా చిత్రంలో నటించిన ఆకాంక్ష, కామాక్షి భాస్కర్ల, పృథ్వీ, ప్రతీ ఒక్కరికి అభినందనలు. ఈ సినిమా విజయం సాధించాలి. సాహు నిర్మాతగా సక్సెస్ అందుకోవాలి. ఇదే బ్యానర్‌లో అనిల్ రావిపూడితో కలసి సినిమా చేయబోతున్నాను. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











