Chiranjeevi Vs CPI Narayana: పులికి మేకను అప్పగించినట్టే.. కులం అడ్డం పెట్టుకొని.. చిరంజీవిపై నారాయణ ఘాటుగా!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ ముఖ్య నాయకుడు నారాయణ ఘాటుగా స్పందించారు. సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూ షూటింగులు ఆగిపోవడంపై ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ బయటకు లాగి కామెంట్స్ చేయడం సరికాదు. సినిమా షూటింగులు ఆగిపోవడం, కార్మికులు సమ్మె చేయడం లాంటి అంశాలను చిరంజీవితో చర్చిస్తే లాభం లేదు అని ఆయన కామెంట్స్ చేశారు. ప్రముఖ ఛానెల్ బిగ్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మాట్లాడుతూ..
సినీ కార్మికుల సమ్మె గురించి చిరంజీవితో నిర్మాతలు చర్చించడాన్ని సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు. చిరంజీవితో నిర్మాతలు చర్చలు జరపడం పులికి పాలు పోసినట్టు.. అలాగే పులికి మేకను అప్పగించినట్టు ఉంటుంది. నిర్మాతలే ఇండస్ట్రీ యాజమాన్యం, పరిశ్రమకు ప్రతినిధులు వారే.. అలాంటి వారితో చిరంజీవితో చర్చలు జరపడం వల్ల లాభం ఉండదు అని నారాయణ అన్నారు.

సినీ కార్మికుల సమ్మెను ముగించాలంటే.. కార్మిక నాయకులతో మాట్లాడాలి. కార్మిక సంఘాలతో అనుబంధం ఉన్న వారితో చర్చించాలి. కార్మిక సంఘం ఆఫీస్ బేరర్లతో మాట్లాడాలి. అలా కాకుండా మేకల్ని తినే వారితో చర్చలు జరపడం ఏమిటి? నారాయణ ప్రశ్నించారు. ఆయన మాట్లాడిన తీరు, చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
హైదరాబాద్‌లో ఓ బ్లడ్ డొనేషన్ క్యాంపు సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్‌పై కూడా సీపీఐ నారాయణ స్పందించారు. బుధవారం మెగాస్టార్ మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. నేను ఎప్పుడూ రాజకీయ నేతలకు సాఫ్ట్ టార్గెట్. ఎవరైనా నన్ను తిడుతూనే ఉంటారు. అయినా నాకు ఫర్వాలేదు అని అంటాను. అలా నాపై అవాకులు, చెవాకులు పేలిన పోలిటిషియన్‌ను ఓ మధ్య వయసు ఉన్న మహిళల గడ్డి పెట్టింది. చిరంజీవి లాంటి మనిషిని నీవు ఎలా తిడుతావు అంటూ ఓ ట్రైబల్ ఏరియాలో దూషించడం చూశాను అని అన్నారు.
ఓ రాజకీయ నేత తనపై అసత్య ఆరోపణలు చేశారు. తనను దూషించడంపై ఓ మహిళ ఆ సదరు నాయకుడిని కడిగిపాడేసింది. రక్తదానంతో ప్రజల ప్రాణాలు కాపాడటం, తన వ్యక్తిత్వానికి అభిమానిని ఆ మహిళ చెప్పడం నా హృదయాన్ని తాకింది అని ఆయన అన్నారు. అయితే గతంలో నారాయణను ఓ మహిళ కడిగిపారేయడం ఉద్దేశించి నా మంచే నాకు రక్షణగా నిలిచింది ఆయన వ్యాఖ్యలు చేయడం వైరల్ అయ్యాయి.
అయితే తాను గతంలో చిరంజీవిపై కామెంట్స్ చేసింది నిజమే. ఆయన మంచి గురించి నాకు అవసరం లేదు. ఒకప్పుడు నేను వాస్తవమే చెప్పాను. కానీ వారు అపార్ధం చేసుకొన్నారు. వారు కులాన్ని అడ్డం పెట్టుకొని వివాదం చేశారు. ఆ సమయంలో నేను నా మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాను. ఆ వివాదం అంతటితో అయిపోయింది. చిరంజీవికి విజ్ఞత ఉంటే ఆ వీడియోలను తొలగించాలి. పాత వీడియోలను ఆధారంగా చేసుకొని కామెంట్స్ చేస్తే.. నేను మళ్లీ మొదలుపెడుతా. ఇప్పటికైనా విజ్ఞతతోని ఆ పాత వీడియోల తీసేయాలి. అది వారికే వదిలివేస్తాను అని సీపీఐ నారాయణ అన్నారు.


Click it and Unblock the Notifications











