Chiranjeevi: కూతురుకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. సుష్మిత ఎమోషనల్ పోస్ట్.. పిక్స్ వైరల్

సుమారు 40 సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమలో హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే హీరో హీరోయిన్ల వారసులు కూడా చిత్రసీమలోకి అడుగుపెట్టి తమదైన సత్తా చాటుతుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూతురు సుష్మిత కూడా సినీ రంగంలో రాణిస్తుంటారు. కాగా మహిళ దినోత్సవం సందర్భంగా ఆమెకు చిరు పవర్ ఫుల్ కాస్ట్ లీ గిఫ్ట్ ను అందించారు.

 వెనువెంటనే ఫ్లాప్, విజయం..

వెనువెంటనే ఫ్లాప్, విజయం..

స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ టాలీవుడ్ లో బాస్ గా మారారు. అప్పట్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు చిరు. ఖైదీ నెం 786 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే 2022 సంవత్సరంలో ఆచార్యతో ప్లాప్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం సాధించారు.

సినిమాకు మంచి హైప్..

సినిమాకు మంచి హైప్..

ఇక 2023 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించారు. అలాగే అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ కనిపించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో మంచి హైప్ వచ్చింది.

 సొంత గుర్తింపు కోసం..

సొంత గుర్తింపు కోసం..

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న వాల్తేరు వీరయ్య చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే సినిమా హీరో హీరోయిన్లు, నటీనటుల వారసులు సినిమాల్లో ఎంట్రీ ఇస్తారన్న విషయం తెలిసిందే. వారికి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సొంత గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతుంటారు. అలాంటి వారిలో చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఒకరు.

ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి..

ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి..

సుష్మిత కొణిదెల హీరోయిన్ గా కాకుండా మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150, గాడ్ ఫాదర్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూనే ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి సినిమాలు రూపొందిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించారు. ఇటీవల సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ సేనాపతికి సహా నిర్మాతగా ఉన్నారు.

వైరల్ గా ఫొటోలు..

వైరల్ గా ఫొటోలు..

ఇదిలా ఉంటే తాజాగా సుష్మితకు మెగాస్టార్ చిరంజీవి శక్తివంతమైన కానుకను ఇచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోవత్సం సందర్భంగా ఆ బహుమతి అందజేశారు చిరు. సుష్మితకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ దుర్గా దేవి ప్రతిమను బహుకరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో సుష్మిత షేర్ చేయగా వైరల్ గా మారాయి.

ఇంతకంటే గొప్పగా..

చిరంజీవి గిఫ్ట్ గా ఇచ్చిన ప్రతిమను, ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేశారు సుష్మిత కొణిదెల. వాటిని పోస్ట్ గా షేర్ చేస్తూ "మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బహుమతి అందించడం చాలా ఆనందంగా ఉంది నాన్న. స్త్రీలను శక్తివంతులుగా దుర్గాదేవి కంటే గొప్పగా దేనితే వర్ణించగలం. ధన్యవాదాలు" అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు సుష్మిత. ఈ ఫొటోలు చూసి మెగా అభిమానులు సైతం ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X