డైరెక్టర్ బాబీకి వెలకట్టలేని మెగా గిఫ్ట్.. చిరంజీవి బహుకరించిన వాచీ ఖరీదు ఎంతో తెలుసా?

తన అభిమానులన్నా.. తనతో సినిమాలు తీసే దర్శకులు అంటే చిరంజీవికి ఎంతో ప్రేమ, గౌరవం. అయితే దర్శకులుగా మారిన అభిమానులంటే ఇంకా ఎంతో ఇష్టాన్ని, ప్రేమను మెగాస్టార్ ప్రదర్శిస్తుంటారు. ఈ విషయం పలు సందర్భాల్లో కూడా రుజువైంది. తనకు నచ్చిన అభిమాన దర్శకుడు, యువ దర్శకుడు ఎవరైనా మంచి సినిమా తీస్తే.. వారిని స్వయంగా పిలిచి.. లేదా ఫోన్‌లో పరామర్శించడం చాలా సందర్భాల్లో కనిపించింది. అయితే తన అభిమానుల్లో ఒకడిగా అలాగే తనకు భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబీకి చిరంజీవి నుంచి అరుదైన గౌరవం, కానుక లభించింది. ఆ కానుక ఏంటనే వివరాల్లోకి వెళితే..

చిరంజీవి అంటే తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టం అని బాబీ గతంలో వెల్లడించారు. తన తండ్రి చిరంజీవి అభిమాని అంటూ కూడా బయటపెట్టారు. అలాంటి అభిమానినైన తనకు చిరంజీవితో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అంటూ ఎమోషనల్ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ, చిరంజీవి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. చిరంజీవికి తనకు ఇష్టమైన దర్శకుల్లో బాబీ ఒకరుగా మారిపోయారు.

Chiranjeevi gifted Priceless Watch to Bobby

అయితే చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చి వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. చిరంజీవిలోని మాస్ ఎలిమెంట్స్, కామెడీని మేళవించి తీసిన ఆ సినిమా 200 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ మెగాస్టార్‌తో సినిమా ఎప్పుడని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తొందరగానే తెర వేశాడు దర్శకుడు బాబీ.

వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవితో మరో భారీ సినిమాకు బాబీ రెడీ అయ్యారు. విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాబీతో సినిమా ఉంటుందనే వార్త అభిమానులకు సంతోషంగా మారింది. చిరంజీవితో మరో సినిమా చేస్తున్నాను. తాను చెప్పిన కథ మెగాస్టార్‌కు బాగా నచ్చింది. ఆ ప్రాజెక్టుకు స్క్రిప్టు, ఇతర పనులు పూర్తయ్యాయని ఇటీవల బాబీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Chiranjeevi gifted Priceless Watch to Bobby

అయితే తాజాగా తన ఫేవరేట్ దర్శకుల్లో ఒకరిగా మారిన బాబీకి చిరంజీవి ప్రేమతో గిఫ్టును ఇచ్చి షాకిచ్చాడు. తన ఇంటికి స్వయంగా పిలిచి.. ఆయనకు ఖరీదైన వాచీని బహుకరించాడు. బాబీ చేతికి స్వయంగా ఆ గడియారాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు. హృదయపూర్వకంగా కౌగిలించుకొని తన అభిమానాన్ని చిరంజీవి వ్యక్తం చేశాడు. మెగా ప్రేమలో తడిసిన బాబీ ఎమోషనల్ అయ్యారు.

తనకు వాచీని బహుకరించిన విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకొంటూ.. నా బాస్ నుంచి ఓ బ్యూటిఫుల్ మెగా సర్‌ప్రైజ్. ఆయనే స్వయంగా పిలిచి నాకు వాచీని బహుకరించాడు. నాకు వెలకట్టలేని గడియారాన్ని బహుకరించిన నా డియరెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్. మీరు చూపించే ప్రేమ, మీరు అందించే ప్రోత్సాహం, మీ ఆశీస్సుల నాకు మరో ప్రపంచంలా ఉంటుంది.ఈ మూమెంట్ జీవితాంతం గుర్తుండిపోతుంది అని బాబీ ట్వీట్‌ ద్వారా ఎమోషన్ అయ్యారు.

ఇక బాబీకి చిరంజీవి బహుకరించిన వాచీ విషయానికి వస్తే.. ఆ వాచ్ మార్కెట్‌లోకి లేటేస్ట్‌గా వచ్చిన ఒమేగా సీమాస్టర్ డైవర్ 300 M. ఈ వాచీ విలువ ఆన్‌లైన్‌లో వెల్లడించిన ప్రకారం.. 4,88,335 రూపాయలు. అయితే ఈ వాచీ ఖరీదు కంటే.. తన అభిమాన దర్శకుడిపై చిరంజీవి చూపించిన ప్రేమ వెలకట్టలేనిది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అని మెగా అభిమానులు చెబుతున్నారు. బాబీపై దక్కిన మెగా గౌరవం చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X