Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Chiranjeevi Manchu Vishnu: చిరంజీవికి షాక్ ఇచ్చిన మంచు విష్ణు!.. మరోసారి పోటీగా..
మెగాస్టార్ చిరంజీవికి మంచు విష్ణు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మా ఎన్నికల సమయంలో వీరిద్దరికి పోటీ నడిచిన విషయం తెలిసిందే. మా ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి, మంచు విష్ణుకు మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలుగు ఇండస్ట్రీలో మా ఎన్నికలు రసవత్తరంగా సాగి ఉత్కంఠను కలిగించాయి. ఇప్పుడు మరోసారి సినిమా పరంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
పండుగ వేళ పోటీ..
చూస్తుంటే పెద్ద సినిమాలన్ని ఒకేసారి దసరా పండుగ వేళ సందడి చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అక్టోబర్ 5న బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున వంటి సీనియర్ హీరోల మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో మంచు విష్ణు కూడా రంగంలోకి దిగాడు.
పరోక్షంగా ప్రకటన..
మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చాడు మంచు విష్ణు. ఇది విష్ణు నటించిన జిన్నా మూవీ విడుదల తేదిని పరోక్షంగా ప్రకటించినట్లుగా ఉంది. ఈ మేరకు మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఇద్దరి మధ్య..
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలు అక్టోబర్ 5న విడుదలకు సిద్థంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే పోటీ ఉందని అంతా అనుకున్నారు. ఇక మంచు విష్ణు తాజాగా చేసిన ట్వీట్ తో ముక్కోణపు పోటీగా కనిపిస్తోంది.
సీనియర్ హీరోలతో పోటీకి..
ఇద్దరు సీనియర్ హీరోలతో యంగ్ హీరో మంచు విష్ణు జిన్నాగా పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పోటీలో ఎవరి సినిమా ఎలా ఆడుతుందో.. ఏ చిత్రం ప్రేక్షకుల ఆశీర్వాచనాలు పొంది విజయం సాధిస్తుందో మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక మరో పాయింట్ ఏంటంటే.. ఈ మూడు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి కాబట్టి మూవీ ప్రమోషన్స్ కూడా ఆసక్తికరంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
రసవత్తర పోరు..
ఇదిలా ఉంటే ఇది వరకు మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణుకు, మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. మెగాస్టార్ సైడ్ నుంచి ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయగా.. మంచు విష్ణు కూడా పాల్గొన్నాడు. ఈ రసవత్తర పోరులో మంచు విష్ణు గెలుపొంది మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాడ్ ఫాదర్ విడుదలయ్యే రోజే మంచు విష్ణు తన సినిమాను రిలీజ్ చేస్తూ తాను కూడా పోటీ ఇస్తానన్నట్లుగా చిరంజీవికి షాక్ ఇచ్చినట్లుగా ఉందని సమాచారం.