God Father: చిరంజీవి మూవీ నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్.. అప్పుడే అంతంటే నమ్మలేరు

ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ యమ జోష్‌తో కనిపిస్తున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను క్రియేట్ చేయడంతో వెనుదిరిగి చూడడం లేదు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి.. రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైపోయిన విషయం తెలిసిందే.

'ఆచార్య' మూవీ షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను మొదలెట్టేశారు. అందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ మలయాళంలో తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న సంగతి విధితమే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ మధ్య మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కూడా.

'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా అంటే చాలా తక్కువ రోజులు మాత్రమే జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఇది అప్పుడే 45 శాతం వరకూ పూర్తైందట. ఇందులో చిరంజీవితో కొన్ని మాత్రమే సన్నివేశాలను షూట్ చేశారని తెలుస్తోంది. మిగిలిన భాగం మాత్రం హీరో లేని సీన్లను షూట్ చేశారని అంటున్నారు. అందుకే అంత తక్కువ సమయంలో దాదాపు సగం టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక, మిగిలిన భాగం మొత్తం ఒకే షెడ్యూల్‌లో జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి కూడా డిసైడ్ అయ్యారని సమాచారం.

Chiranjeevis God Father Shooting Update

'లూసీఫర్' మూవీని దర్శకుడు మోహన్ రాజా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాడు. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేశాడు. దీని కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాత్ర తర్వాత ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది ఇందులో మంజూ వారియర్ పోషించిన హీరో చెల్లెలి రోల్ మాత్రమే. దీనికి సీనియర్ హీరోయిన్లను తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X