twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌ కోసం మరో స్పెషల్ ఈవెంట్: చిరంజీవితో పాటు గెస్టుగా ఆ స్టార్ హీరో

    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ పొలిటికల్ బ్యాగ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఏకకాలంలోనే తెలుగు, హిందీతో పాటు మలయాళంలోనూ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

    Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!

    సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీని అక్టోబర్ 5న విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. అలాగే, రెండు రోజుల క్రితమే అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సందడి ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

    Chiranjeevi Godfather Special Event in Dubai

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో కూడా నిర్వహించాలని అనుకున్నారు. దానికి సల్మాన్ ఖాన్‌ను గెస్టుగా తీసుకు రావాలని భావించారు. కానీ, అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఇదే వేడుకను దుబాయ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్‌ కూడా హాజరు కాబోతున్నాడని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షోపైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

    ఇదిలా ఉండగా.. 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను చేస్తున్నాడు. నయనతార, సల్మాన్ ఖాన్ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Megastar Chiranjeevi doing Godfather Under Mohan Raja Direction. This Movie Team Plans Special Event in Dubai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X