కీలక ఘట్టానికి ‘సైరా’... చిరంజీవి డైలాగులతో దద్దరిల్లుతున్న స్టూడియో!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా' నరసింహారెడ్డి చిత్రం కీలక ఘట్టానికి చేరుకుంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయింది. దీంతో చిరంజీవి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని శబ్దాలయ స్టూడియోలో డబ్బింగ్ ఫార్మాలిటీస్ మొదలయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి చెప్పే డైలాగులతో స్టూడియో దద్దరిల్లిపోతోంది.

'సైరా' చిత్రానికి సంబందించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. విఎఫ్ఎక్స్ సీన్స్‌కు సంబంధించిన మైనర్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈవారంలో ఆ పని కూడా కంప్లీట్ కానుంది. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం ఉన్న నిఫుణులను పిలించినట్లు తెలుస్తోంది.

Chiranjeevi has kick-started the dubbing for Sye Raa

ఆగస్టు చివరి వరకు సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

'సైరా నరిసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరో వైపు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. రూ. 200 కోట్ల పై చిలుకు బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X