twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ను వదలని మెగాస్టార్.. మరే హీరో చేయని విధంగా!

    |

    అభిమానులు లేనిదే సినిమా హీరోలు లేరు అలాగే సినిమా హీరోలు లేనిదే వాళ్ళ అభిమానులు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోలకు అభిమానులకు ఉన్న అవినాభావ సంబంధం వారికి తప్ప మరెవరికీ అర్థం కాదు. అలాగే హీరోలకు బలం బలహీనత రెండూ అభిమానులే అని చెప్పక తప్పదు. చిరంజీవి కూడా అందుకు ఏమాత్రం అతీతులు కారు. తాజాగా కరోనా సమయంలో తన అభిమానులు అనంతర కాలంలో బ్లడ్ బ్రదర్స్ గా మారిన కొంత మందికి చిరు అండగా నిలబడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కరోనా బారిన పడిన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ కుటుంబాల‌కు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు.


    బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ కుటుంబాల‌కు ఆర్థిక భ‌రోసానిచ్చారు. ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలంటే ముందుండే అభిమానులలో ఎవరికి కరోనా సోకినా వెంటనే వారితో మాట్లాడి ధైర్యం నింపుతున్న చిరంజీవి. అవసరమైతే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే కాక ఆయా ఆస్పత్రుల కు ఫోన్ చేసి డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కరోనాకారణంగా మరణించిన హిందూపురానికి చెందిన ప్రసాద్ రెడ్డి కరోనాతో మరణించగా వారి కుటుంబంతో మాట్లాడి ధైర్యానిచ్చిన చిరంజీవి ప్రసాద్ రెడ్డి శ్రీమతి పద్మావతి పేరున రూ.3 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు.

    Chiranjeevi Helps his fans in corona situation

    అలాగే కడపకు చెందిన రవి ప్రసాద్ కూడా కరోనాతో మరణించగా వారి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన చిరు ఆయన కుమార్తె ప్రియాంక పేరున 3 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి భ‌రోసానిచ్చారు. ఇక విశాఖలో కరోనాతో భార్యాభర్తలయిన శ్రీనివాస రావు- సరస్వతిలకు వైజాగ్ లో ఆస్ప‌త్రి బెడ్ దొరక్క‌పోవ‌డంతో మెగాస్టార్ సురక్ష హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే కాక వారి పేరున 2 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఇక త‌మ‌ను ఆప‌ద‌లో ఆదుకున్న చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ వారు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

    English summary
    As we all know tollywood actor chiranjeevi is helping many families in this pandemic situation.. as per latest reports he is depositing lakhs of rupees for fan's families. the families who lost their family members due to Corona.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X