బాలకృష్ణ సినిమా ఆడదని.. చిరును బ్రతిమిలాడిన నిర్మాత.. ఎందుకు? ఏ మూవీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పోటాపోటీగా యాక్షన్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారి సినిమాలు కూడా క్లాష్ అవుతూ వస్తున్నాయి. గతంలో 2023 సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలయ్యాయి. దాంతో రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంది.

చిరు వర్సెస్ బాలయ్య అన్నట్టుగా సినిమాలు విడుదలవుతున్నారు. ఆ రేంజ్ లోనే ప్రేక్షకులను మెప్పిస్తూ బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని విధంగా వసూళ్లను రాబడుతున్నారు. అయితే వీరిద్దరూ ఒక సినిమాకు ఒకరు సహకరించుకుంటూ కూడా కనిపిస్తున్నారు. ఆ మధ్యలో బాలయ్య సినిమా రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి గెస్ట్ గా హాజరై అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. తాము ఇద్దరం ఎంతో స్నేహపూర్వకంగా ఉంటామని, సినిమాల విషయంలోనే పోటీ పడుతుంటామని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ కూడా విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు.

Chiranjeevi Helps to Nandamuri Balakrishna Aditya 369

చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో స్ట్రాంగ్ కంటెంట్ రాయగలిగే సత్తా ఉంటే కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చిరంజీవి చెప్పారు. సమరసింహారెడ్డి లాంటి పాత్ర లో బాలయ్యను, ఇంద్రలో తను నటించిన ఇంద్రసేనారెడ్డి లాంటి పాత్రలను రాయగలిగి డైరెక్ట్ చేయగలిగే సత్తా ఉంటే తాము ఇద్దరం కలిసి నటించే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే ఇప్పుడు ఒకరికి ఒకరు ఎలా సహకరించుకుంటున్నారో గతంలోనూ సహకరించుకున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమా మరింత విజయవంతం కావడం కోసం చిరంజీవి స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టాలంటే.

నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే బెస్ట్ మూవీ, సై ఫై, టైం ట్రావెలింగ్ ఫిలిం ఆదిత్య 369 ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 1991లో విడుదలైన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ సరసన మోహిని నటించింది. అమ్రిష్ పూరి విలన్ పాత్రలో అలరించారు. సిల్క్ స్మిత కూడా కీలక పాత్ర ను పోషించింది. అనిత కృష్ణ, బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడం కోసం చిరంజీవితో ప్రమోషన్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. ఒక 30 సెకండ్ల యాడ్ లో చిరంజీవిని సినిమా గురించి ప్రమోట్ చేయాలని నిర్మాత కోరారంట.

చిరంజీవి నిర్మాతలు అడగడంతో ఏమాత్రం నో చెప్పకుండా వెంటనే 30 సెకండ్ల యాడ్ కు సహకరించారంట. అది దూరదర్శన్ లో వచ్చి సినిమాకి మంచి బజ్ ఏర్పడిందంట. ఇలా చిరంజీవి బాలకృష్ణ సినిమాకు సహకరించడం పట్ల అభిమానులు కృషి అవుతున్నారు. ఇక నెక్స్ట్ బాలకృష్ణ అఖండ 2లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకోవాల్సిన సినిమాకు డేట్స్ కూడా ఇచ్చేశారు. సినిమా ఫార్మల్ పూజా కార్యక్రమం కూడా గ్రాండ్గా జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X