రాంచరణ్ దంపతులకు బిడ్డ పుట్టేది ఆ నెలలోనే.. శుభవార్తను పంచుకొన్న మెగాస్టార్ చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి అన్ని రకాల శుభవార్తలతో ఫుల్ జోష్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అద్బుతమైన వసూళ్లను సాధిస్తూ రికార్డులను తిరగరాస్తున్నది. కెరీర్ పరంగానే కాకుండా ఫ్యామిలీ విషయంలా పరంగా సంతోషంతో ఉన్నారు. అవార్డులు, రివార్డులు ఓ పక్క.. మరో పక్క ఫ్యామిలీలో చోటుచేసుకొన్న సంఘటనలతో చాలా ఆనందంగా ఉన్నారు. 2022 సంవత్సరాన్ని ఆనందదాయకంగా ముగించి.. 2023 సంవత్సరంలో అంతే జోష్‌తో లైఫ్‌ను రఫ్ ఆడిస్తున్నారు. అయితే చిరంజీవి తన ఫ్యామిలీలోకి రాబోతున్న వారసుడు/వారసురాలి గురించిన విషయాలను వెల్లడిస్తూ...

2022 సంవత్సరంలో తీపి గుర్తులు అంటూ
నా జీవితంలో 2022 సంవత్సరం ఎన్నో తీపి గుర్తులను మిగిల్చింది. నా కెరీర్ 45 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్నది. నాకు ఇంకా సినిమాలపై దాహార్తి తీరలేదు. సినిమాల్లో నటించాలని ఇంకా అనుకొంటున్నాను. చివరి శ్వాస వరకు నటించేందుకే మొగ్గు చూపుతాను. ఇప్పుడున్న హీరోలతో కూడా పోటీ పడేందుకు రెడీగా ఉన్నాను. సినిమాల విషయంలో ఎలాంటి రాజీ లేదు. వరుసగా సినిమాలు చేయాలన్నదే నా సంకల్పం అని చిరంజీవి అన్నారు.

సినిమాలతో బిజీగా ఉండాలని..
సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకొంటున్నాను. అందుకే వరుసగా నాలుగైదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సినిమా షూటింగ్ ఉంటే హుషారుగా ఉంటాను. సెట్సోలకి వెళ్లాలనే ఆలోచన రాగానే ఒక ఎనర్జీ వస్తుంది. కష్టపడే మనస్తత్వం లేకుంటే.. కష్టపడే ఓపిక లేకుంటే నేను సినిమాల నుంచి రిటైర్ అవుతాను. అలాంటి సమయం వస్తే స్వచ్చందంగా తప్పుకొంటాను అని చిరంజీవి చెప్పారు.

పాపులర్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు
2022 సంవత్సరంలో భారత ప్రభుత్వం తరపున పాపులర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ అవార్డు లభించడం హ్యాపీగా ఉంది. నాకు అవార్డు వచ్చిన ఐదు రోజుల్లోనే రాంచరణ్‌కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాంచరణ్ నటించిన RRR ప్రపంచవేదికల మీద గుర్తింపు పొందడం, నేను నటించిన గాడ్‌ఫాదర్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. 2022లో నాకు చాలా సంతృప్తి లభించింది అని చిరంజీవి అన్నారు.

రాంచరణ్ తండ్రి కాబోవడం గురించి
ఇక కుటుంబపరంగా మా ఇంట్లో అందరు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. రాంచరణ్ తండ్రి కాబోతున్నాడనే విషయం మా ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించింది. నాకు ఎనలేదని ఆనందం ఇచ్చే శుభవార్తను రాంచరణ్ అందించారు. మాకు చాలా ఎమోషనల్ విషయంగా మారింది. ఆ శుభ సమయం ఎప్పుడొస్తుందా అనేది ఎదురు చూస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

ఉపాసన కొణిదెల డెలివరీ డేట్ ఎప్పడంటే?
రాంచరణ్, ఉపాసన దంపతులు 2023లో శుభవార్తను అందిస్తారు. బహుశా ఆగస్టులో కానీ, జూలై గానీ ఆ శుభవార్త అందించే అవకాశం ఉంది. ఆగస్టు అయితే ఇంకా బాగుంటుందని అనుకొంటున్నాను. కానీ ఆగస్టుకు ఒక నెల అటు గానీ..ఇటు గానీ ఉండవచ్చు. ఏది ఏమైనా మా ఇంటిలో ప్రస్తుతం ఆనందకరమైన వాతావరణం ఉంది అని చిరంజీవి చెప్పారు.

వాల్తేరు వీరయ్యతో 2023 ఘనంగా
ఇక చిరంజీవి 2023 ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. అలాగే RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం మరో శుభసూచకంగా మారింది. 2023లో మెగా ఫ్యామిలీకి అంతా సానుకూలంగాను, ఆనందకరంగాను ఉందనే విషయం తాజా ఫలితాలతో స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











