twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తీవ్ర విషాదంలో చిరంజీవి.. గర్వించదగిన అభిమాని మరణంతో మెగాస్టార్ ఆవేదన

    |

    మెగాస్టార్ చిరంజీవిని ప్రాణం కంటే ఎక్కువ అభిమానించే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే ఫ్యాన్స్ అంటే ప్రాణం కంటే అమితంగా ఇష్టపడుతారు చిరంజీవి కూడా. అలాంటి అభిమానుల్లో యర్రా నాగబాబు ఒకరు. చిరంజీవి కెరీర్ ఆరంభం నుంచి అభిమానించే యర్రా నాగబాబు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. మెగాస్టార్ అందించిన స్పూర్తితో కోనసీమ ఐ బ్యాంక్‌ను ప్రారంభించి ఎంతో మందికి సేవలందించారు.

    అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యర్రా నాగబాబు ఇటీవల కరోనావైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ రావడంతో చికిత్సం పొందతున్నారు. అయితే చికిత్స పొందుతూ ఇటీవల మరణించడంతో అభిమాన లోకంతోపాటు చిరంజీవి కూడా విషాదంలో మునిగిపోయారు. నాగ‌బాబు ఊహించ‌ని మ‌ర‌ణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందంటూ మెగాస్టార్ చిరంజీవి తీవ్ర‌ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

    Chiranjeevi in deep sarrow over Fan Yerra Nagababu death

    యర్రా నాగబాబు మృతి నేపథ్యంలో చిరంజీవి మాట్లాడుతూ.. య‌ర్రా నాగ‌బాబు నా వీరాభిమాని. అభిమానుల్లోనే గ‌ర్వ‌కార‌ణ‌మైన అభిమాని నాగ‌బాబు. ఎన్నో మంచి సామాజిక కార్య‌క్ర‌మాల‌తో మరింత గ‌ర్వ‌కార‌ణ‌ం అయ్యారు. నా ఐ బ్యాంక్ స్ఫూర్తితో తాను కూడా కోన‌సీమ‌ ఐ బ్యాంక్ ప్రారంభించారు. ఎంద‌రికో కంటి చూపు నిచ్చాడు.

    కరోనావైరస్ బారిన పడిన నాగబాబు కాకినాడ ల‌క్ష్మీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగబాబు మరణం చాలా బాధాక‌రం. కొద్దిరోజుల క్రితం ఆయ‌న‌తో మాట్లాడితే భరోసాగా మాట్లాడాడు. చికిత్స బాగుందని, కోలుకొంటున్నారని తెలిపారు. డాక్ట‌ర్లు భ‌రోసా కూడా భరోసాను ఇచ్చారు. కానీ అనుకోకుండానే ఆయ‌న‌ తిరిగి రాని లోకాలను వెళ్లిపోయారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు మాన‌సిక స్త్వైర్యాన్ని ఇవ్వాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను. సారీ నాగ‌బాబు.. ఐ మిస్ యు! అని తన సంతాప ప్రకటనలో చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    Megastar Chiranjeevi once again into deep sarrow. His die hard Fan Yerra Nagababu died with coronavirus positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X