అల్లు అర్జున్ కు చురకలు? చిరంజీవి వ్యాఖ్యలు ఘాటుగా

గత కొన్నాళ్ల నుంచి కూడా అల్లు వర్సెస్ మెగా హీరోల నడుమ కోల్డ్ వార్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇది మాత్రమే కాకుండా ఈ రెండు కుటంబాల అభిమానుల నడుమ సోషల్ మీడియాలో అయితే దారుణంగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇక ఇలా కొన్నాళ్ల నుంచి సాగుతున్న ఈ గొడవలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

మెయిన్ గా కొన్నాళ్ల పాటుగా అల్లు అర్జున్ మెగా నీడలో ఉంటూ మెగా హీరోస్ కోసం అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం ఎన్నోసార్లు మంచిగా ప్రస్తావించిన రోజులు, ఘటనలు కోకొల్లలు. మరి ఇలాంటి అల్లు అర్జున్ హిట్స్ పడటం మొదలయ్యాక తన నుంచి అసలు షేడ్స్ బయటపడ్డాయి అని మెగా అభిమానులు వాదిస్తూ ఉంటారు.

chiranjeevi in direct counters to allu arjun

చెప్పను బ్రదర్ అనడం నుంచి మెగా కాదు తనని మించి మరొకరు లేరు అనే రేంజ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వడం వంటివి మరింత సంచలనంగా మారాయి. ఇలా అల్లు అర్జున్ తన పంథాలో వెళ్లిపోతుంటే మెగా కుటుంబంలో కొందరు యంగ్ హీరోస్ కొన్నిసార్లు అల్లు అర్జున్ పై పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇటీవల ఓ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనకి ఎంత సక్సెస్ వచ్చి ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా క్యారెక్టర్ అనేదే ముఖ్యం అలా ఎంత ఎదిగినా కూడా క్యారెక్టర్ లేకపోతే ఆ సక్సెస్ ఎందుకూ పని చేయదు అనే రీతిలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో అలాగే సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారాయి.

ఇక ఈ మాటలు విన్న మెగా అభిమానులు సహా ఇతర హీరోల అభిమానులు కూడా చిరంజీవి ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ని ఉద్దేశించే అన్నారు అంటూ ప్రచారం కూడా చేసేస్తున్నారు. మరి చిరు అంటించిన చురకలు అల్లు అర్జున్ కేనా లేక తాను నార్మల్ గానే అన్నారా అనేది తనకి మాత్రమే తెలియాలి.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠతో భారీ చిత్రం విశ్వంభర చేస్తుండగా ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ సక్సెస్ సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనీల్ రావిపూడితో క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ ని తాను చేస్తున్నారు. అలాగే వీటి తర్వాత దసరా, ది ప్యారడైజ్ చిత్రాలు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో భారీ యాక్షన్ సినిమాని చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అయితే పాన్ ఇండియా హిట్ పుష్ప 2 తర్వాత దర్శకుడు అట్లీతో ఓ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ని తాను చేస్తున్నాడు. మరి దీనిపై కూడా సెన్సేషనల్ హైప్ ఇపుడు నెలకొంది.

More from Filmibeat

Read more about: allu arjun chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X