మొక్కే కదా అని వదిలేస్తే.. చిరు పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతవరకు చిరు కామెడీ టైమింగ్‌ను వెండితెరపై చూసి ఎంజాయ్ చేసిన వారికి సోషల్ మీడియాలో అంతకుమించి ఎంర్టైన్మెంట్ దొరుకుతోంది. చిరు చేసే ప్రతీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉగాది పర్వదినాన రంగంలోకి దిగిన చిరంజీవి.. సోషల్ మీడియాను చెడుగుడు ఆడేస్తున్నాడు. ఎవరికి ఏ టైప్‌లో కౌంటర్ ఇవ్వాలో ఇచ్చేస్తూ.. అందరి లెక్కలు సరిచేసేస్తున్నాడు. వరుస ట్వీట్లతో హల్చల్ చేస్తున్న చిరంజీవి దూకుడుకు నెటిజన్స్‌లు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు చిరును చాలా మిస్ అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం ట్విట్టర్‌నే కాదు ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఓ రేంజ్‌లో వాడేస్తున్నాడు. కాసేపటి క్రితమే చిరు చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంద్ర సినిమాలోని ఎవర్ గ్రీన్ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా.. అదే డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. మొక్కే కదా అని వదిలేస్తే.. అంటూ అలా డ్యాష్‌లతో వదిలేశాడు. ప్రతీ రోజూ ఉదయం తన దినచర్య అలా మొక్కలకు నీళ్లు పట్టడంతో మొదలవుతుందని తెలిపాడు. ఈ 21 రోజుల లాక్ డౌన్‌ను పాటించండని, ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











