‘సరిలేరు’ ఈవెంట్‌కు మెగాస్టార్.. భారీ స్కెచ్ వేసిన సూపర్ స్టార్
భరత్ అనే నేను, మహర్షి లాంటి చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మరోసారి వసూళ్ల సునామిని సృష్టించేందుకు సరిలేరు నీకెవ్వరు అంటూ సిద్దమవుతున్నాడు. ఎఫ్2 లాంటి చిత్రంతో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సరిలేరుపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి.

టీజర్‌తో సోషల్ మీడియా షేక్..
అప్పటి వరకు పోస్టర్స్, మహేష్ స్టిల్స్‌తో ఊరిస్తూ వచ్చిన చిత్రయూనిట్.. టీజర్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిమిషం పాటు సాగిన ఆ టీజర్‌లో మహేష్ మ్యానరిజం, యాటిట్యూడ్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా ఉండబోతోన్నాయో చూపించారు.

ఒక్కో వారం ఒక్కో పాట..
ఒక్కో వారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసింది. మైండ్ బ్లాక్, సూర్యుడివో, హీ ఈజ్ సో క్యూట్ అనే పాటలను రిలీజ్ చేసింది.
మెగా ప్లాన్ వేసిన చిత్రబృందం..
మహేష్ గత చిత్రాలకు ఎన్టీఆర్, వెంకటేష్‌లను తీసుకురాగా.. ఈ సారి మెగా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న అల్లు అర్జున్, మహేష్ బాబు.. రాజమౌళి హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను పంచుకుంటారని, టాక్ వచ్చింది. మహేష్ కోసం మెగా హీరో రానున్నాడని, అల్లు అర్జున్ కోసం ఎన్టీఆర్ వస్తాడని వార్తలు హల్ చల్ చేశాయి.

హాజరుకానున్న చిరు..
సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నాడని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుక జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతోన్నట్లు తెలిపింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











