Bhola Shankar Trailer: రామ్ చరణ్ బాబులా చేస్తుండు.. ఫినిషింగ్ అదుర్స్.. భోళా శంకర్ ట్రైలర్

ఎంతోకాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో తర్వాతి సినిమాలపై జోరు పెంచారు. ఈ క్రమంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు.

బిల్లా మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినట్లుగానే ఇవాళ అంటే జూలై 27న సాయంత్రం భోళా శంకర్ ట్రైలర్ వదిలి అభిమానులకు సూపర్ ట్రీట్ అందించారు. ఇక భోళా శంకర్ ట్రైలర్ పై లుక్కెస్తే..

Chiranjeevi Keerthy Suresh Bhola Shankar Movie Trailer Released By Ram Charan

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ చిత్రం. చాలా కాలం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటనతో అలరించనుంది.

Chiranjeevi Keerthy Suresh Bhola Shankar Movie Trailer Released By Ram Charan

సాంకేతికవర్గం: భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా, గెటప్ శ్రీను, కాశీ విశ్వనాథ్, సితార, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు.

Chiranjeevi Keerthy Suresh Bhola Shankar Movie Trailer Released By Ram Charan

ఆగస్టు 11న: ఆగస్టు 11న విడుదలకు సిద్దంగా ఉన్న భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. భోళా శంకర్ ట్రైలర్ చిరు మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది.

అన్ని ఎలిమెంట్స్: భోళా శంకర్ ట్రైలర్ లో చిరంజీవి తెలంగాణ యాస, డైలాగ్స్ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి. కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మిల్కీ బ్యూటి తమన్నాతో డ్యూయెట్ సాంగ్స్, కీర్తి సురేష్ తో స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఫినిషింగ్ అలా: అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బాబులా నటిస్తుండు అని చిరంజీవి గురించి తమన్నా చెప్పే డైలాగ్ మరింత విజిల్స్ కొట్టించేలా ఉంది. శ్రీముఖి భోళాజీ అంటే చిరంజీవి బోలోజి అనడం చిరు కామెడీ టైమింగ్ కు అద్దం పడుతుంది. ఇక ట్రైలర్ ఎండింగ్ లో పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ చిరు చెప్పు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X