Just In
- 4 min ago
షాకింగ్: ‘ఫైటర్’ ఆ సినిమాకు సీక్వెల్.. అప్పుడు ఆ హీరోతో హిట్ కొట్టాడు.. మరి ఇప్పుడు.?
- 51 min ago
గొల్లపూడి మరణం : ఓ రత్నాన్ని కోల్పోయాం.. ఎప్పటికీ మరువలేము..
- 1 hr ago
ఇద్దరికీ పుత్ర శోకాలే.. : పరుచూరి.. ఒంటారయ్యాననే ఫీలింగ్ : అన్నపూర్ణ
- 2 hrs ago
శ్రీయను చుట్టుముట్టిన పోలీసులు.. విపత్కర పరిస్థితి.. షాకైన హీరోయిన్
Don't Miss!
- News
నిర్భయ దోషుల ఉరిశిక్షకు ఏర్పాట్లు: ఇద్దరు తలారులు చాలు: వారిని పంపించండి: తీహార్ నుంచి ఆదేశం..!
- Technology
ఏడవ తరగతిలోనే డేటా సైంటిస్ట్ అయ్యాడు
- Sports
బీసీసీఐ ట్వీట్.. హార్దిక్, రాహుల్‌ల మధ్య ఏం జరుగుతుంది?!!
- Lifestyle
చలికాలంలో పొడి దగ్గుతో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో త్వరగా తగ్గుతుంది!
- Finance
శాలరీలో పీఎఫ్ తగ్గించుకొని, జీతం పెంచుకుంటే రూ.లక్షలు నష్టపోతారు!
- Automobiles
రింగ్ రోడ్లో 10ఏళ్ల పిల్లవాడి కార్ డ్రైవింగ్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ: బ్యాంకాక్‌లో చిరంజీవి.. వాళ్లతో కలిసి ప్రైవేటు రిసార్ట్‌లో సిట్టింగ్స్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు. 'పునాది రాళ్లు' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈయన.. తన పునాదిని బలంగా వేసుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా అయిపోలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు బ్రేక్ పడింది. ఇక, 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎన్నో అంచనాలతో వచ్చి ప్రభావం చూపలేదు
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్రభావం చూపలేదు. ఫలితంగా నష్టాలను ఎదుర్కొంది.

ఇది విడుదలవకుండానే ఇంకొకరికి సిగ్నల్
‘సైరా' విడుదల అవకముందే మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించనుంది. సోషల్ మెసేజ్‌తో సినిమాలు చేసే ఈయన మరోసారి అదే తరహా కథను సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరు డుయల్ రోల్ చేస్తున్నారని టాక్.

కథతో ముడిపడింది కాబట్టే ఇలా ఫిక్స్
ఇక, ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా వరకు వార్తలు వస్తున్నాయి. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో టైటిల్ ‘గోవింద ఆచార్య' అని ఉంది. కానీ, దీనికి ‘గోవిందా హరి గోవిందా' అని టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం దేవాదాయ భూముల కబ్జా గురించి ఈ సినిమా ఉండడమేనని సమాచారం.

తెలుగులోనే ఏకైక హీరోగా రికార్డు
ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. హీరోయిన్, టైటిల్, రిలీజ్ డేట్ సహా ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు గానూ చిరంజీవి రూ. 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే అత్యధిక మొత్తం తీసుకున్న హీరోగా నిలుస్తారు.

బ్యాంకాక్ వెళ్లిన చిరు.. వాళ్లతో కలిసి సిట్టింగ్స్
కొరటాల శివతో చేసే సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం అవుతుందని అనుకున్నారు. కానీ, ఎందుకో ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే, అంతకంటే ముందు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిరంజీవి, కొరటాల శివ, మణిశర్మ తదితరులు కలిసి బ్యాంకాక్ వెళ్లారట. అక్కడ ఓ ప్రైవేటు రిసార్టులో మ్యూజిక్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుందని సమాచారం.