twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో చిరు సాయం

    |

    ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా 'సైరా నరసింహ రెడ్డి'. ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. దీని తర్వాత మెగాస్టార్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు కొరటాల. సైరా షూటింగ్‌లో ఆలస్యం కారణంగా చిరంజీవి ఆయన సెట్స్ పైకి రావడం కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సైరా షూటింగ్ ఫినిష్ కావడంతో ఇక మెగా 152 సినిమా అప్‌డేట్స్‌పై పడ్డాయి అందరి కళ్లు.

    చిరంజీవి- కొరటాల శివ కాంబోలో రానున్న మొదటి సినిమా ఇదే. దీంతో కొరటాల టేకింగ్‌లో మెగాస్టార్ అభినయం చూడాలని ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు కొరటాల శివ. అయితే ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల కోసం ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. మెగా 152 కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిరు సాయం చేస్తున్నారట.

    Chiranjeevi- Koratala Sivas Movie Update

    చిరంజీవి కోసం ఓ విలక్షణ పాత్రను డిజైన్ చేశారట కొరటాల శివ. చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించేలా చిరు పాత్ర ఉండనుందట. ఈ మేరకు చిరంజీవిని కాస్త బరువు తగ్గాలని కూడా కొరటాల కోరాడని తెలిసింది. కాగా చిరు ఫిట్‌నెస్‌పై సలహాలు, సూచనల కోసం రామ్ చరణ్.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ని సంప్రదించారట. ఈ మేరకు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కార‌ణంగా ముంబై నుండి ఓ ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని పంపించాడట సల్మాన్. ప్రస్తుతం ఆయన పర్య‌వేక్ష‌ణ‌ లోనే చిరంజీవి తన ఫిట్‌నెస్ క‌స‌రత్తులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికైతే షూటింగ్ మొదలుకాక ముందు నుంచే చిరు- కొరటాల సినిమాపై భారీ హైప్ నెలకొంది.

    English summary
    Mega power star Ram Charan is the reason for Koratala Siva and Chiranjeevi up coming movie delay. Now latest talk is Chiranjeevi is ready to go on sets of Koratala Siva. The Shooting will strats from August.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X