చిరంజీవే నాకు ఇష్టం.. ఆయన స్ఫూర్తితో హీరోనయ్యాను..
భారతి క్రియేషన్స్, క్యాథరీన్ ఫిల్మ్ మేకర్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం GF. చిరంజీవి కుంచాల, వైదేహి శర్మ, అస్మా మిర్జా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతి కుంచాల, వెంకట్ కృష్ణ కుంచాల నిర్మాతలు. హీరోగా నటిస్తూ ''జీఎఫ్'' చిత్రానికి చిరంజీవి కుంచాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. వైఎస్ఆర్ సీపీ నాయకులు వెంకట్ రెడ్డి, టీఎమ్మార్పీఎస్ నేత ఇటుక రాజు మాదిగ, మాల మహానాడు నాయకులు చెన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు పాల్గొన్నారు.
దర్శకుడు, హీరో చిరంజీవి కుంచాల మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన స్ఫూర్తితోనే హీరోగా మారాను. GF మూవీలో యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు తండ్రి కూతురు మధ్య ఉండే చెప్పలేనంత ప్రేమ మా సినిమాలో చూస్తారు. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు GF సినిమాను తీసుకొస్తాం. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అని అన్నారు.

మాల మహానాడు నాయకుడు చెన్నయ్య మాట్లాడుతూ.. చిరంజీవి కుంచాల హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమాను రెండు రాష్ట్రాల ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు మా వంతు సహకారం అందిస్తాం. అన్నారు.

కో ప్రొడ్యూసర్: కళ్యాణ్,
కొరియోగ్రఫీ: వెంకట్ దీప్
సినిమాటోగ్రఫి: వల్లి
ఎడిటర్: ఎంఎన్ఆర్
సంగీతం: యూవీ నిరంజన్
స్టంట్స్: షావోలిన్ మల్లేష్
నిర్మాతలు: భారతి కుంచాల, వెంకట్ కుంచాల
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: చిరంజీవి కుంచాల


Click it and Unblock the Notifications











