మెగాస్టార్‌తో సూపర్ స్టార్.. మంతనాలకు కారణం? వైరల్ పిక్ షేర్ చేసిన మహేష్ సతీమణి
మెగాస్టార్ చిరంజీవితో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏవో మంతనాలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ మీట్ పెట్టుకొని కాసేపు ముచ్చటించడం హాట్ టాపిక్ అయింది. జనవరి 5వ తేదీన హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు చిరంజీవి. సరిగ్గా ఈ సమయంలో ఈ ఇద్దరూ మీట్ అయ్యారంటే ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
పైగా మెగాస్టార్‌తో సూపర్ స్టార్ కలిసిన ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. 'ఓకే రకమైన మనస్తత్వం కలిగిన ఇద్దరు యాక్టర్స్ మీట్' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ చూసి మెగా, ఘట్టమనేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేదికపై ఈ అరుదైన కలయిక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











