తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటి.. సైరా సినిమా చూడాలని..

తెలంగాణ గవర్నర్ తమిళిసాయిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. శనివారం మధ్యాహ్నం గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌కు వెళ్లి భేటీ అయ్యారు. అంతేకాకుండా దసరా పండుగ శుభాంకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్టు సమాచారం. గవర్నర్‌తో భేటీ దాదాపు గంటకుపైగానే జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా చిరంజీవికి తేనేటి విందును ఇచ్చినట్టు తెలిసింది.

ఇక చిరంజీవి తన 151వ చిత్రం సైరా నర్సింహారెడ్డి చిత్రంతో అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథా నేపథ్యంగా తెరకెక్కింది. ఈ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో గవర్నర్‌ను చిరంజీవి కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.

Chiranjeevi met with Telangana Governor Tamili sai

గవర్నర్‌ తమిళిసాయితో భేటి సందర్భంగా సైరా సినిమా ప్రస్తావన రాగా.. చిరంజీవిని అభినందించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సైరా చిత్రాన్ని వీక్షించాలని చిరంజీవి కోరగా అందుకు సమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే గవర్నర్ కోసం ప్రత్యేక షోను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Chiranjeevi met with Telangana Governor Tamili sai

కాగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై హీరో రాంచరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం ప్రస్తుతం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చ, జగపతిబాబు తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X