మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎనిమిదో హీరో.. టాలీవుడ్‌కు మరో వారసుడు!
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి తెలుగు పరిశ్రమకు మరోకరు పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఏడుగురు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న సంగతి తెలిసిందే.
వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 21న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇంకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు వైష్ణవ్ తేజ్‌ను ఆశీర్వదించారు.


గ్రామీణ కథా నేపథ్యంతో పక్కా మాస్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందులో వైష్ణవ్ తేజ్ జాలరిగా నటిస్తున్నట్టు అర్ధమైంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











