Chiranjeevi: యవ దర్శకుడితో చిరంజీవి కొత్త సినిమా.. మరో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ! హీరోయిన్ ఎవరంటే?
ఎంతోకాలంగా తెలుగు చిత్రసీమలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో తర్వాతి సినిమాలపై జోరు పెంచారు. ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి దశకు వచ్చేసింది. ఇప్పుడు తర్వాతి సినిమాపై ఫోకస్ పెడుతున్నారు మెగాస్టార్. అయితే దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు గింగిరాలు తిరుగుతున్నాయి.
తమిళ రీమేక్
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయనకు జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటిస్తోంది. అలాగే చిరుకి చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ సందడి చేయనుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం చిత్రానికి భోళా శంకర్ రీమేక్ అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

టాక్సీ డ్రైవర్
ఇక భోళా శంకర్ సినిమాకు ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మేడే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. కలక్ కతా బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ ఉండగా.. అందులో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు.
సాంకేతిక వర్గం
ఇక భోళా శంకర్ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. దీంతో ఈ సినిమాను అనుకున్నట్లుగానే ఆగస్టు 11కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మా సంగీతం అందించగా, డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు.

మరో యంగ్ హీరో
ఇప్పుడు తాజాగా మరో యువ దర్శకుడితో చిరంజీవి సినిమా (Mega156) చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా ఉండనుంది. ఈ సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దడంతోపాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. అయితే ఈ సినిమాలో మరో యంగ్ హీరోకు అవకాశం ఉందని టాక్.

సిద్ధు జొన్నలగడ్డ
ఇప్పటికే పలువురు యంగ్ హీరోల పేర్లు పరిశీలించగా.. చివరికి విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ దగ్గరకు ఆగారట. ఈ ఇద్దరిలో చిరంజీవి ఎవరికి ఓకే చెబితే వాళ్లు సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఇంకా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నల గడ్డనే నటిస్తాడని అంటున్నారు. ఇద్దరు మంచి నటులే కాబట్టి ఎవరు నటిస్తారో చూడాలి.

సుస్మిత బ్యానర్ లో
చిరంజీవి, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాను చిరు డాటర్ సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఓకే చేశారట మేకర్స్. అంతేకాకుండా అందుకు శ్రీలీల కూడా పచ్చా జెండా ఊపిందని సమాచారం. చిరుతోపాటు నటించే మరో హీరోకు జోడీగా ఈ బ్యూటీ చేయనుందని తెలుస్తోంది. ఈ వివరాలపై త్వరలో అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారట.



Click it and Unblock the Notifications











