Chiranjeevi: వేలమంది కష్టాన్ని దోచేశాడు.. చిరంజీవి ఆగ్రహం

Chiranjeevi: సినీ పరిశ్రమకు పెనుభూతంలా మారిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ( IBomma) నిర్వహించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనేక సైట్స్ బ్లాక్ చేసినా మళ్లీ కొత్త డొమైన్‌తో పుట్టుకొస్తున్న ఐ బొమ్మ వెబ్‌సైట్‌కు అసలు సూత్రధారి ఇమ్మడి రవి అని తేలింది. పోలీసులు నేరుగా అతడి నుంచే లాగిన్ యాక్సెస్ తీసుకుని వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించడం, బ్యాంక్ అకౌంట్లలోని రూ.3 కోట్లకు పైగా డబ్బును ఫ్రీజ్ చేయడం, వందలాది హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఐబొమ్మ( IBomma)నిర్వహించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి,కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించబడింది. ఈ అరెస్ట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శక దీరుడు రాజమౌళి, సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు పాల్గొన్నారు.

Chiranjeevi on IBomma Ravi s Arrest Says Piracy Steals Years of Hard Work

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "చాలా సంవత్సరాల నుండి ఈ పైరసీ అనే మహమ్మారితో సినిమా ఇండస్ట్రీ బాధపడుతుంది. ఈ మహమ్మారి నుండి ఇలా తప్పించుకోవాలనీ ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. సినిమా ఇండస్ట్రీ పై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమంది ఆధారపడి ఉన్నారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలే కాదు... లైట్ బాయ్, స్పాట్ బాయ్, మేకప్ మాన్, డ్రైవర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఫ్లోర్ మీద కనిపించే కనిపించని ప్రతి ఒక్కరి జీవితమే సినిమాలపై ఆధారపడింది. ఇంతమంది కష్టాన్ని ఒక్కడు అప్పనంగా వచ్చి దోచుకుంటున్నాడు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో పైరసీ నేరగాళ్లు "దమ్ముంటే పట్టుకోండి" అని బహిరంగంగా సవాళ్లు విసరిస్తున్న స్థాయికి అహంకారం పెరిగిందని, అది ఇండస్ట్రీకి మరింత అవమానకరమైందని చిరంజీవి అన్నారు.ఇలాంటి సమస్యలో మార్గమేంటీ? ఈ మహ్మమరి నుంచి నుండి ఎలా బయటపడతాం? అని తర్జనభర్జన పడుతున్న వేళ.. పోలీసులు మాకు అండగా నిలిచారు. గత సిపి ఆనంద్ గారు పైరసీని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. కానీ ఆయన పదవి మారిన తర్వాత పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందేమో అనే భయం మాలో ఉంది" అని చిరంజీవి గుర్తుచేశారు.

' కానీ, ప్రస్తుత హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సినీ రంగం కష్టాల్ని అర్థం చేసుకుని, తనే ముందుకు వచ్చి పైరసీని అణచివేయడానికి చర్యలు ప్రారంభించారని ఆయన ప్రశంసించారు. ఆయన చూపించిన చొరవకి,సహకరించిన ఇతర పోలీసులకు అందరికీ ప్రత్యేక అభినందనలు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరిన పైరేట్ ను ఈరోజు చకచక్కంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నుండి మనస్ఫూర్తిగా తెలంగాణ పోలీసులకు అభినందనలు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ముందు కూడా సినీ పరిశ్రమ, పోలీసు శాఖ కలిసి పనిచేస్తే, ఏదోక రోజు పైరసీ అనే రాక్షసం పూర్తిగా నిర్మూలించబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X