చిరంజీవితో పవన్ కల్యాణ్.. రూమర్లకు చెక్‌పెట్టిన నాదెండ్ల

సినీ తారలు, రాజకీయ నేతలు కలుసుకోవడం సర్వసాధారణమే. ఇక రాజకీయాలతో సంబంధమున్న సినీ సెలబ్రిటీలు కలుసుకోవడం తరుచుగా కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా చిరంజీవితో జనసేన నేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలుసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రధాన్యం సంతరించుకొన్నది.

చిరంజీవితో భేటీ కావడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. సైరా నర్సింహారెడ్డి (చిరంజీవి)ని కల్యాణ్ గారు, నేను కలుసుకొన్నాం. ఈ సందర్భంగా మా మధ్య పలు అంశాలు చర్చలకు వచ్చాయి. జీవన ప్రమాణాలు, స్ఫూర్తి కలిగించే విషయాల గురించి మాట్లాడుకొన్నాం. మాకు స్ఫూర్తిని కలిగించే మాటలను చిరంజీవి చెప్పారు. అలాగే చిరంజీవితో ఇలాంటి సమావేశం కోసం, ఆసక్తికరమైన అంశాలపై చర్చించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను అని మనోహర్ నాదెండ్ల పేర్కొన్నారు.

Chiranjeevi, Pawan Kalyan, Nadendla Manohar goes viral in social media

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనిని ఆయన ఇటీవలే పూర్తి చేశారు. త్వరలోనే కొరటాల శివ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, ఏపీ, దేశ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్ ఇటీవల ఎన్నికల హడావిడి నుంచి తేరుకొంటున్నారు. జనసేన ఓటమి గురించి విశ్లేషణలు సాగిస్తున్నారు. తానా సభల్లో పాల్గొని ఇటీవలే స్వదేశానికి చేరుకొన్నారు. కాగా చిరంజీవి, పవన్ మధ్య సంబంధాలపై వస్తున్న రూమర్లకు చెక్ చెప్పే విధంగా ఈ ఫొటో ఉందనే విషయం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X