నిర్మాత కృష్ణ మోహ‌న్ రావు మ‌ర‌ణం బాధించింది.. చిరంజీవి ఎమోషనల్

టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కృష్ణ మోహ‌న్ రావు మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన నేటి మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆర్.కె. ఫిలిమ్స్ అధినేతగా ప్రముఖ చిత్రాలను నిర్మించిన ఆయన మరణించడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తాజాగా చిరంజీవి ఆయనతో ఉణ్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నిర్మాత కృష్ణ మోహన్ రావు (81) గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య అధికం కావడంతో నేటి మధ్యాహ్నం కృష్ణమోహన్ రావు మరణించారు. పు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. తన నిర్మాత మరణ వార్త తెలుసుకుని చిరంజీవి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. .

 Chiranjeevi Pays tribute to Kovelamudi Krishna Mohan rao Death

కృష్ణ మోహ‌న్ రావు మ‌ర‌ణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'నేను న‌టించిన యుద్ధ‌భూమి చిత్రాన్ని ఆయన నిర్మించారు. అలాగే ఇద్ద‌రు మిత్రులు చిత్రాన్ని కూడా తన సోదరులు కె రాఘవేంద్రరావుతో కలిసి ఆయన నిర్మించారు. కృష్ణ మోహన రావు వండ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్.. ఆయ‌న లేని లేటు తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుని ప్రార్థిస్తూ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X