Vajrotsavam Controversy: మోహన్ బాబుకు చిరంజీవి చురకలు.. వేడెక్కిన 17 ఏళ్ల నాటి వివాదం!
ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, వెంకట్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌కు తెలుగు సినిమా రంగంలో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
తెలుగు సినిమా పరిశ్రమ నా ఇల్లు అనుకొంటే.. ఇంట్లో గెలిచే అవకాశం 2007 సంవత్సరంలో వజ్రోత్సవం సందర్భంగా వచ్చింది. అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డు ప్రధానం చేస్తామంటే చాలా సంతోషం వేసింది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా, కొంతమంది హర్షించని సమయంలో నాకు ఆ అవార్డు తీసుకోవాలని అనిపించలేదు. అలా నాకు వచ్చిన అవార్డును ఓ బాక్స్‌లో పెట్టి.. నాకు అర్హత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తీసుకొంటాను అని చిరంజీవి అన్నారు.

అయితే ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నాఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున.. ఈ అవార్డు పుచ్చుకొన్న రోజున, అదీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తీసుకొన్న రోజున.. నా మిత్రుడు నాగార్జున మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ.. ఈ అవార్డుకు మీకే అర్హత ఉందని చెప్పినప్పుడు.. ఇప్పుడు ఇంట గెలిచాను. రచ్చ గెలిచాను అనే పీలింగ్ కలిగింది అని మెగాస్టార్ అన్నారు.
ఇదిలా ఉండగా, వజ్రోత్సవం సందర్భంగా జరిగిన వివాదం వివరాల్లోకి వెళితే.. మోహన్ బాబు మాట్లాడుతూ.. మిమ్మల్ని సన్మానిస్తున్నానని కొందరు వచ్చి చెప్పారు. అయితే ఆ సన్మానం ఏమిటి? అంటే.. మీరు లెజెండ్ కాదు.. మీకు సెలబ్రిటీ హోదాలో అవార్డు ఇచ్చి సన్మానం చేయాలని అనుకొంటున్నాం అని చెప్పారు. ఈ సందర్భంగా మీ మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుకొంటున్నాను. లెజెండరీ అంటే ఏమిటి? అర్ధం? సెలబ్రిటీ అంటే ఏమిటి? అంటే ఏమిటో ఓ పుస్తకం రాసి.. వాటికి అర్ధం వివరించి అవార్డు ఇవ్వండి అంటూ మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా ఇండస్ట్రీలో బతికి ఉన్న నటుల్లో తొలిసారి రాజ్యసభకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిని. కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అది లెజెండరీ కాదా? చాలా మంది పేదలకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాను అది లెజెండరీ కాదా? 500 సినిమాలకు పైగా నటించాను. 45 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. అది లెజెండరీ కాదా? అని ప్రశ్నించారు.

మోహన్ బాబు ప్రశ్నించడంపై చిరంజీవి ఘాటుగా స్పందించారు. నేను ఒక రామారావు, రాఘవేంద్రరావు, బాపు గారు, విశ్వనాథ్ గారు, దాసరి నారాయణ గారు ఉన్నారు. వారంతా లెజెండ్స్. వారికి అవార్డు ఇవ్వండి. నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా ఒకే ఏజ్ వాళ్లం. నాకు అవార్డు ఇచ్చి నన్ను వారి నుంచి దూరం చేయకండి.. నన్ను పెద్దవాడిని చేయకండి అన్నాను. నాకు లెజెండరీ అవార్డు వద్దు అన్నది సత్య అని చిరంజీవి ఆవేశంగా అన్నారు.
అయితే నేను లెజెండరీ అవార్డు తీసుకొనేందుకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దానికి అర్హుడిని కాదని భావిస్తే.. ఆ అవార్డును తీసుకోను. దానిని ఓ బాక్స్‌లో పెట్టి సరెండర్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ అవార్డుకు అర్హుడినైతే దానిని తీసుకొంటాను. 100 ఏళ్ల ఫంక్షన్ జరిగే సమయానికి నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అప్పటి వరకు పెద్దవాళ్లం అవుతాం. అప్పుడు నాకు అర్హత ఉంటే అవార్డు తీసుకొంటాను. అప్పటి వరకు ఆ అవార్డును సమాధి చేస్తాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











