‘ఆచార్య’ మూవీలో పొలిటికల్ టచ్: వాటిపైనే కొరటాల ఫోకస్.. అదరగొట్టిన చిరంజీవి

రీఎంట్రీలో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ ఉత్సాహంతోనే ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇప్పుడు చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా కొరటాల శివ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలన్నీ ఏదో ఒక మెసేజ్‌తో రూపొందాయి. ఈ క్రమంలోనే 'ఆచార్య' కూడా దేవాదాయ భూముల ఆక్రమణల గురించి వస్తుందని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కొరటాల శివ కొన్ని పొలిటికల్ సెటైరికల్ డైలాగులను రాశారని తెలుస్తోంది. వాటిని మెగాస్టార్ చిరంజీవి చెప్పే విధానం కేకలు పెట్టించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఒక రకంగా గతంలో వచ్చిన 'ఠాగూర్' సినిమాను గుర్తు చేసేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

 Chiranjeevi Political Dialogues Highlight in Acharya

మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'ఆచార్య'లో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఇందులో నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టెంపుల్ టౌన్‌ సెట్‌లో జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. సంగీత, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X