Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్య జంటపై చిరంజీవి పోస్ట్.. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే?
మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. నాగబాబు నటించిన హ్యాండ్సప్ మూవీలో బాల నటుడిగా చేసిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి హిట్లు అందుకున్నాడు.
ఇక వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో వస్తున్న వార్తలకు చెక్ పడింది. శుక్రవారం రోజున హైదరాబాద్ లో ఈ హీరోహీరోయిన్ల ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. దీనిపై చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మెంబర్స్ బ్యూటిఫుల్ నోట్స్ రాసుకొచ్చారు.

మెగా వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వచ్చిన ఊహగానాలు.. పుకార్లు కాకుండా నిజమయ్యాయి. వీళ్లిద్దరు కలిసి విన్నర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించగా షూటింగ్ సెట్ లో ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ఇక 2016 నుంచి ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది.
జూన్ 9న అంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది.
ఇక వీరి నిశ్చితార్థం సందర్భంగా ఈ జంటకు మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, మంచు లక్ష్మీ, ప్రగ్యా జైశ్వాల్, కోన వెంకట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. "నిశ్చితార్థంతో ఒక్కటైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. మీరు అద్భుతమైన జంటగా నిలుస్తారు. అందరి ప్రేమాభిమానాలతో మీ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా" అని మెగాస్టార్ చిరంజీవి బ్యూటిఫుల్ నోట్ రాసుకొచ్చారు.
అన్నయ్యా ఎంతోకాం నుంచి ఈరోజ కోసం ఎదురుచూస్తున్నా. వెల్ కమ్ టు ది ఫ్యామిలీ వదిన అని నిహారిక కొణిదెల రాసుకొచ్చింది. ఇక నిహారికకు లావణ్య ఎప్పటి నుంచో స్నేహితురాలు అని తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ లలో లావణ్య కనిపించడంతో వీరిపై రూమర్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో నిహారికకు ఫ్రెండ్ గా లావణ్య హాజరైనట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











