బ్లఫ్ మాస్టర్‌పై చిరు ప్రశంసలు.. గాల్లోతేలిపోయిన డైరెక్టర్
ఏదైనా మంచి చిత్రం వచ్చినప్పుడు, కొత్తవాళ్లు ప్రతిభను కనబర్చినప్పుడు వారిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తాడు. ఇంటికి పిలిపించుకుని మరీ ముచ్చటిస్తాడు. సత్కరిస్తాడు. ప్రతీ ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చిస్తాడు. అలా ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను చిరు అభినందించిన విశేషాలు చూశాం. తాజాగా బ్లఫ్ మాస్టర్ చిత్రంపై మెగాస్టార్ రివ్యూ ఇచ్చాడు. గొప్ప సినిమా అంటూ డైరెక్టర్‌ను పొగిడాడు.
శతురంగ వెట్టై అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్‌లోని మరో కోణాన్ని చూపెడుతుంది. నటనలోని విశ్వరూపాన్ని చూపెడుతూ డైరెక్టర్ గోపీ గణేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే విడుదలైన సమయం సరైంది కాదో ఏమో గానీ జనాల్లోకి అంతగా వెళ్లలేదు. కానీ బుల్లితెరపై బ్లఫ్ మాస్టర్ బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంపై చిరు ప్రశంసలు కురిపించడం, డైరెక్టర్‌ను ఇంటికి పిలిపించుకుని చర్చిండం జరిగింది.

తన గురించి తన సినిమా గురించి ప్రతీ సీన్ గురించి చిరంజీవి వివరించడం, మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని గోపీ పేర్కొన్నాడు. అంతేకాకుండా సత్యదేవ్‌ను ఎవ్వరూ చూపించలేనంత అద్భుతంగా చూపించానని అనడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి తన సినిమా చూడటం, గొప్పగా చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ ఉబ్బితబ్బిబైపోయాడు.


Click it and Unblock the Notifications











