twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya డిజాస్టర్ ఫలితం.. రెమ్యునరేషన్ ఇచ్చేసిన చిరంజీవి, రాంచరణ్, కొరటాల.. ఎన్ని కోట్ల నష్టమంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాఫ్‌ మూవీగా ఆచార్య చిత్రం కావడం సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి, రాంచరణ్ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆచార్య ఫ్లాప్‌కు దర్శకుడు కొరటాల శివనే కారణమని అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే ఈ సినిమా కారణంగా తీవ్ర నష్టాల్లో అంటే.. 80 కోట్లకుపైగా నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు పరిహారం చెల్లించారు. అయితే ఏ మేరకు ఈ నష్టాన్ని చెల్లించారంటే..

    Recommended Video

    Acharya Movie Review సినిమా Average కామ్రేడ్ | Filmibeat Telugu
    80 కోట్ల నష్టాన్ని పూడ్చేందుకు

    80 కోట్ల నష్టాన్ని పూడ్చేందుకు

    ఆచార్య చిత్రాన్ని నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారనేది సినీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను రిలీజ్‌కు ముందే 120 కోట్లకు బిజినెస్ చేశారు. అయితే ఈ సినిమా దాదాపు 40 కోట్ల వరకు రాబట్టింది. అయితే డిస్టిబ్యూటర్లకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు దాదాపు 80 కోట్ల వరకు వెనక్కి ఇచ్చివేసినట్టు సమాచారం.
     అమెరికా నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి

    అమెరికా నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి


    అయితే ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి నెల రోజులపాటు విదేశాలకు వెళ్లివచ్చారు. అమెరికా నుంచి ఇటీవల చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత డిస్టిబ్యూటర్ల నష్టాల లెక్కలకు ముగింపు పలికినట్టు తెలిసింది. డిస్టిబ్యూటర్ల నష్టాలను పూడ్చేందుకు చిరంజీవి 12 కోట్లు, రాంచరణ్ 6 కోట్ల వరకు తమ వంతుగా చెల్లించినట్టు సమాచారం.

     ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కొరటాల శివ

    ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కొరటాల శివ


    అయితే చిరంజీవి, రాంచరణ్ తర్వాత మిగితా మొత్తాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కుల నుంచి కొంత, మిగిత కొంత దర్శకుడు కొరటాల శివ చెల్లించినట్టు సమాచారం. తన రెమ్యునరేషన్‌తోపాటు ఇంకొంత మొత్తాన్ని తన వ్యక్తిగత పూచీకత్తుగా డబ్బును కూడా కొరటాల శివ చెల్లించినట్టు సినీ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇంకా మిగిలిన కొంత మొత్తాన్ని జూన్ రెండో వారం లోపు అకౌంట్స్ సెటిల్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది.

     నిరంజన్ రెడ్డికి ఏ మేరకు నష్టమంటే..

    నిరంజన్ రెడ్డికి ఏ మేరకు నష్టమంటే..


    ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రం తన పెట్టుబడిని వెనక్కి తీసుకొన్నారు. అయితే డిస్టిబ్యూటర్ల నష్టాలను కొంత మేరకు భరించేందుకు అంగీకరించారు. జీఎస్టీ ఖర్చులను భరించేందుకు ఆయన ఒప్పుకొన్నారు. దాంతో అందరు కలిసి డిస్టిబ్యూటర్లతో వివాదానికి చెక్ పెట్టారు. త్వరలోనే ఆచార్య నష్టాల అంశానికి తెరపడే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

     ఎన్టీఆర్ సలహా కారణంగానే..

    ఎన్టీఆర్ సలహా కారణంగానే..


    అయితే ఆచార్య నష్టాల వ్యవహారంలో దర్శకుడు కొరటాల శివ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అనేది సినీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ సలహా మేరకు డిస్టిబ్యూటర్ల నష్టాలను కొరటాల తన భుజాలపై వేసుకొన్నాడు. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ బాధ్యత వహించి అప్పులను తీర్చాడు. ఎన్టీఆర్ సినిమాకు ముందే ఆచార్య లెక్కలను ముగించాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు అని ఇండస్ట్రీ వర్గాల ఓ వార్త వైరల్ అవుతున్నది.

    English summary
    Acharya movie pushed distributors heavy losess. In this bad phase, Chiranjeevi, Ram Charan, Koratala Siva returned remunerations for Acharya distributor's loses
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X