ఇండస్ట్రీ అండతో మరింత ఎదగాలి: జానీ మాస్టర్‌కు చిరంజీవి, రాంచరణ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన పుట్టిన రోజును కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకొన్నారు. జానీ మాస్టర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌కు సంబంధించిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణులు జానీ మాస్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
జానీ మాస్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. జానీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ రోజు నీ పుట్టిన రోజు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. భగవంతుడి ఆశీస్సులు నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

నీ రంగంలో నీవు మరింత ఎదగాలి, రాణించాలని కోరుకొంటున్నాను. నీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్‌కు ఇండస్ట్రీ ఎప్పుడు అండదండగా ఉంటుందే కానీ.. ఎన్నడూ అన్యాయం చేయదు. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని, మరింత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకొంటూ మరోసారి నీకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

అంతకు ముందు జానీ మాస్టర్‌కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన శుభాకాంక్షలను అందజేశారు. నాకు అత్యంత ఇష్టమైన కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్ డే విషెస్. త్వరలోనే మనమంతా షూట్స్ పాల్గొనాలని కోరుకొందాం. అప్పటి వరకు క్షేమంగా ఇంటిపట్టునే ఉండాలి అంటూ రాంచరణ్ తన సందేశంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











