రంగంలోకి చిరంజీవి.. మెగా, నందమూరి అభిమానులు ఖుషీ అయ్యేలా స్పెషల్ రియాక్షన్

మెగా, నందమూరి అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ RRR మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి. ఉగాది కానుకగా కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ పోస్టర్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. మరి చిరు ఏమన్నారు? ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆ వివరాలు చూద్దామా..

రంగంలోకి మెగాస్టార్.. అభిప్రాయాలు పంచుకుంటా అంటూ!

రంగంలోకి మెగాస్టార్.. అభిప్రాయాలు పంచుకుంటా అంటూ!

ఉగాది పండగ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజే (మార్చి 25) తన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన చిరంజీవి.. తన అభిప్రాయాలను, ఆలోచనలను అభిమానులతో పంచుకోవడానికి సామజిక మాద్యమాల్లోకి ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించారు.

మెగాస్టార్ మొదటి ట్వీట్..

మెగాస్టార్ మొదటి ట్వీట్..

ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశాక మొదటగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు చిరంజీవి. ''శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలంతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది'' ఆయన పేర్కొన్నారు.

RRR మోషన్ పోస్టర్.. చిరంజీవి ఏమన్నారంటే

RRR మోషన్ పోస్టర్.. చిరంజీవి ఏమన్నారంటే


ఉగాది కానుకగా విడుదలైన RRR మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ పోస్టర్‌కి నీరాజనం పలుకుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన చిరంజీవి.. ''ఇప్పుడే RRR మోషన్ పోస్టర్ చూశాను. రోమాలు నిక్కబొడుస్తూ కనువిందు చేస్తోంది ఈ వీడియో. మిరమిట్లు గొలిపే మ్యూజిక్ అందించారు కీరవాణి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతం సృష్టించారు. ఈ ఉగాదికి అపారమైన శక్తిని అందించారు.

RRR కిక్.. హీరోలిద్దరిని చూసి..

RRR కిక్.. హీరోలిద్దరిని చూసి..

ఇప్పటి వరకు RRR నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వని చిత్రయూనిట్.. ఉగాది కానుకను అదిరిపోయేలా ప్లాన్ చేశారు. 'రౌద్రం రణం రుధిరం' అంటూ విడుదల చేసిన టైటిల్, మోషన్ పోస్టర్ అందరికీ స్పెషల్ కిక్ ఇచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వేషధారణలు సినిమాపై ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేశాయి.

Recommended Video

Megastar Chiranjeevi To Enter Social Media | నా భావాలు అన్నీ పంచుకోడానికి వస్తున్నా..!!

RRR మూవీ.. రేంజే వేరులే!!

డీవీవీ దానయ్య సమర్పణలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. చిత్రంలో కొమురం భీం రోల్‌లో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. చిత్రాన్ని 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X