For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పీడు పెంచిన చిరంజీవి: కుర్ర హీరోయిన్లతో కలిసి సందడి చేయనున్న స్టార్

  |

  ఆరు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపించడంతో పాటు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. ఆ తర్వాత‌ 'సైరా: నరసింహారెడ్డి' చేశారు. ఆ వెంటనే బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించి.. దాన్ని ఈ మధ్యనే కంప్లీట్ చేసుకున్నారు. ఇది ప్రేక్షకుల ముందుకు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశారు. ఇప్పుడు వాటినే ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.

  Bigg Boss OTT: షోలోకి వివాదాస్పద నటి ఎంట్రీ.. పోలీస్ కేస్ తర్వాత ఊహించని విధంగా!

  ఏకంగా నాలుగు సినిమాలను ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేశారు. అందులో ఒకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్' ఒకటి. ఈ సినిమా మీదే అందరూ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఈ చిత్రాన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేశ్ రూపొందిస్తుండడమే. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.

  'భోళా శంకర్' సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా గత నవంబర్‌లో దీన్ని మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఎంతో వేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌లో ఓ సూపర్ సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. ఇది రెండు మూడు రోజులు జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

   Chiranjeevi Restarts Bhola Shankar Shoot

  ఇక, ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెగాస్టార్ చిరంజీవి.. మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న 'గాడ్ ఫాదర్' మూవీ షూట్‌లో పాల్గొన్నారు. అలా ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు 'భోళా శంకర్' మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి ఆయన ఈ మూవీ షూటింగ్‌లో భాగం అవుతున్నారు. ఇందులో చిరుతో పాటు సోదరిగా నటిస్తోన్న కీర్తి సురేష్, హీరోయిన్‌గా చేస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇది దాదాపు 20 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు.

  English summary
  Chiranjeevi Doing Bhola Shankar Movie with Director Meher Ramesh. Now Chiranjeevi, Keerthi Suresh and Tamannaah Participating in This Movie Shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X